మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

Published : Sep 30, 2018, 10:42 AM ISTUpdated : Sep 30, 2018, 10:44 AM IST
మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

సారాంశం

గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ ఒక మల్టీస్టారర్ కథలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో విజయ్ తో సూర్యనటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  ఇకపోతే టాక్ పై విజయ్ స్పందించాడు. 

అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం బజ్ బాగా క్రియేట్ అవుతోంది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

పైగా విజయ్ ప్రమోషన్స్ డోస్ కూడా గట్టిగా పెంచేస్తున్నాడు. అసలు విషయంలోకి వస్తే గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ ఒక మల్టీస్టారర్ కథలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో విజయ్ తో సూర్య నటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  ఇకపోతే టాక్ పై విజయ్ స్పందించాడు. మంచి కథ అనుకుంటే అందులో ఆలోచించడానికి ఏమి లేదు. చేసెయ్యడమే. ఒకరిద్దరు తన దగ్గరకు ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. 

ఇంకా దాని గురించి ఫైనల్ నిర్ణయానికి రాలేదు. అలాంటి ప్రాజెక్టు రావాలని చాలా మంచి కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి అఫీషియల్ గా ఏమి అనుకోలేదని మల్టి స్టారర్ పై తనకున్న అభిప్రాయాన్ని విజయ్ సున్నితంగా చెప్పాడు. ఇక ద్విబాష చిత్రంగా తెరకెక్కిన నోటా చిత్రం అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ గా ఒకేసారి రిలీజ్ కాబోతోంది.  

PREV
click me!

Recommended Stories

Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..
నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్