విజయ్ దేవరకొండ తొలి ముద్దు అనుభవం!

Published : Oct 22, 2018, 04:16 PM IST
విజయ్ దేవరకొండ తొలి ముద్దు అనుభవం!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా ఫ్లాప్ అయినా ఏ హీరో కూడా ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోడు కానీ విజయ్ దేవరకొండ తన సినిమా ఫ్లాప్ అయిందని ఏకంగా పోస్ట్ లే పెడతాడు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా ఫ్లాప్ అయినా ఏ హీరో కూడా ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోడు కానీ విజయ్ దేవరకొండ తన సినిమా ఫ్లాప్ అయిందని ఏకంగా పోస్ట్ లే పెడతాడు.

తనపై జోక్స్, మీమ్స్ ని పబ్లిక్ ఈవెంట్ లో వేసి చూపించడం కూడా విజయ్ కే చెల్లింది. దీంతో జనాల్లో కూడా అతడికి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న విజయ్ తన తొలిముద్దు అనుభవం గురించి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

నువ్ ఫస్ట్ కిస్ ఎప్పుడు పెట్టావ్..? ఎలా అనిపించింది..? అని హోస్ట్ విజయ్ ని ప్రశ్నించగా దానికి సమాధానంగా.. తడుముకోకుండా.. 19 ఏళ్ల వయసులో అని చెప్పేశాడు విజయ్. తను బాయ్స్ హాస్టల్ లో చదువుకోవడం వలన అమ్మాయిలతో పరిచయాలు, స్నేహాలు ఆలస్యంగా అయ్యాయనీ.. మొదట్లో కాస్త భయపడేవాడినని చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. అలానే అతడు నటించిన 'టాక్సీవాలా' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవి కూడా చదవండి.. 

త్రిష కారణంగా విజయ్ దేవరకొండకి అవమానం!

హిట్టిచ్చిన దర్శకుడిని విజయ్ దేవరకొండ హీరోని చేస్తాడట?

నా యాటిట్యూడ్ మారదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

నిర్మాత విజయ్.. హీరో పెళ్లి చూపులు డైరెక్టర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

ఫ్లాప్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ ప్రయోగం.. ఏం చేస్తాడో?

PREV
click me!

Recommended Stories

Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే