లీగల్ గా చర్యలు.. తండ్రిని హెచ్చరిస్తూ విజయ్ ప్రకటన

By Surya PrakashFirst Published Nov 6, 2020, 8:10 AM IST
Highlights

విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరును వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తన తండ్రిని హెచ్చరించారు. తన పేరునుగానీ, ఫొటోలనుగానీ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఉపయోగించకూడదన్నారు.

 తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ప్రారంభించిన పార్టీతో తనకు సంబంధం లేదని ప్రముఖ నటుడు విజయ్‌ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇంకా ఆ పార్టీలో తన అభిమానులెవ్వరూ చేరవద్దని కోరారు. విజయ్‌ తరఫున ‘అఖిల ఇండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో రాజకీయ పార్టీ నమోదు కోసం ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి వెళ్లింది. అందులో జనరల్‌ సెక్రటరీగా ఎస్‌ఏ చంద్రశేఖర్‌, ట్రెజరర్‌గా విజయ్‌ తల్లి శోభ పేర్లను నమోదు చేశారు. దీంతో త్వరలో విజయ్‌ రాజకీయ పార్టీని ప్రారంభిస్తారన్న వార్తలు వెలువడ్డాయి. దీన్ని విజయ్ ఖండించారు.

వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ హీరో , ఇళయ దళపతి విజయ్‌ పాలిటిక్స్ లోకి వస్తున్నారంటూ,రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఆయన ఖండించలేదు..అలాగని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. అవకాసం ఉన్నప్పుడల్లా రాజకీయాలపై అయితే మాట్లాడుతున్నారు. దీంతో అభిమానుల్లో కన్ఫూజన్ ఓ రేంజిలో పెరిగింది. దీనికి తోడు రీసెంట్ గా విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ ..‘ఆల్‌ ఇండియా దళపతి విజయ్‌ మక్కల్ ఇయక్కం’ పేరుతో విజయ్‌ అభిమానులు ఈసీలో కొత్త పార్టీని నమోదు చేసారు. 2021 సమ్మర్ లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈ పార్టీ పోటీ చేయనుందని ప్రచారం జరుగుతోంది. దాంతో విజయ్‌ పార్టీ గురించి తమిళనాట సోషల్‌ మీడియాలో జోరుగా చర్చలు మొదలయ్యాయి. గురువారం ఈ వార్త మరో స్థాయి చేరింది. 

దాంతో విజయ్ స్వయంగా స్పందించారు. అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసారు. అందులో తన తండ్రి పార్టీకి కానీ మరో పార్టీకు గానీ తనకు సంభందం లేదన్నారు. తన పేరుతో ఇమేజ్ తో వచ్చే ఏ పార్టీలో జాయన్ కావటం కానీ అశోశియోట్ అవ్వటం కానీ చెయ్యద్దనన్నారు. తనకు ఆ పార్టీ నమోదుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరును వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తన తండ్రిని హెచ్చరించారు. తన పేరునుగానీ, ఫొటోలనుగానీ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఉపయోగించకూడదన్నారు.

మరో ప్రక్క విజయ్‌ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ విజయ్‌ తండ్రి ఎ.చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చాలని అభిమానులు కోరుతున్నారన్నారు. విజయ్‌ మక్కల్ ఇయక్కంని ఆల్‌ ఇండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కంగా నమోదు చేశారని తెలిపారు. ఇది పూర్తిగా అభిమానుల కోరిక మేరకు జరిగిందన్నారు.   విజయ్‌ కోసం ఇలా చేయలేదని, తన ప్రత్యేక శ్రద్ధ కారణంగా మాత్రమే రాజకీయ పార్టీ నమోదుకు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తెలిపారు. విజయ్‌కి ఈ వ్యవహారంలో సంబంధం లేదని అన్నారు. భవిష్యత్తులో విజయ్‌ ఇందులోకి వస్తారా? అనే ప్రశ్నకు విజయ్‌ మాత్రమే సమాధానం చెప్పాలని తెలిపారు. 
 

click me!