'మహానటి'లో చూపించింది తప్పే: సావిత్రి కూతురు

Published : May 22, 2018, 12:27 PM IST
'మహానటి'లో చూపించింది తప్పే: సావిత్రి కూతురు

సారాంశం

సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' సినిమాలో తన తండ్రిని తప్పుగా చూపించారంటూ 

సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' సినిమాలో తన తండ్రిని తప్పుగా చూపించారంటూ జెమినీ గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సావిత్రికి తాగుడు అలవాటు చేసింది తన తండ్రి కాదని వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన సావిత్రి కూతురు విజయ ఛాముండేశ్వరి తన అక్క చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించారు.

''సినిమాను ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తుంటారు. నేను ఓ కోణంలో చూస్తే అక్క మరో పాయింట్ ఆఫ్ వ్యూతో చూసుంటారు. అంతేకాని ఇక్కడ ఎవరిదీ తప్పు లేదు. అయితే సినిమాలో అమ్మకి మద్యం సేవించడం నాన్న అలవాటు చేసినట్లుగా చూపించడం తప్పే అది నేను ఒప్పుకుంటాను. చిత్ర పరిశ్రమలో సోషల్ డ్రింకింగ్ అనేది కామన్. అమ్మకి కూడా పార్టీల వల్లే మందు అలవాటు అయింది. సినిమాలో అమ్మ, నాన్న కారణంగా తాగినట్లు చూపించారు కానీ ఆమె తాగడం అదే మొదటిసారి కాదు. అయితే అది సోషల్ ప్లేస్ కాదు కాబట్టి ఆమె మొదట వ్యతిరేకించింది. అయితే సినిమా మా అక్కకి మరోలా అర్ధమై ఉంటుంది. దీనికారణంగా మా మధ్య ఎలాంటి విభేదాలు రావు. నా అక్కచెల్లెళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. మా నాన్న కుటుంబమే నా కుటుంబం కూడా'' అని స్పష్టం చేశారు. 

  

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్