Beast Trailer: తాను రాజకీయ నాయకుడిని కాదు, సైనికుడిని అంటోన్న `థళపతి` విజయ్‌.. యాక్షన్‌ ఫీస్ట్

Published : Apr 02, 2022, 07:04 PM IST
Beast Trailer: తాను రాజకీయ నాయకుడిని కాదు, సైనికుడిని అంటోన్న `థళపతి` విజయ్‌.. యాక్షన్‌ ఫీస్ట్

సారాంశం

ఇళయ థళపతి విజయ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `బీస్ట్`. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నేడు శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇది దూసుకుపోతుంది. 

`థళపతి` విజయ్‌(Vijay) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `బీస్ట్`(Beast). నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే (Poja Hegde) కథానాయికగా నటించింది. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్ నిర్మించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన, యాక్షన్‌ ప్రధానంగా సాగే `బీస్ట్` చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఉగాది పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం ఈ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఉత్కంఠభరితంగా సాగే యాక్షన్‌ ఎలిమెంట్స్ తో సాగే ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. విజయ్‌ ఫ్యాన్స్ కి ఫుల్‌ యాక్షన్‌ ట్రీట్‌లా ఉండబోతుందని తెలుస్తుంది. 

`బీస్ట్` ట్రైలర్‌ (Beast Trailer) ని బట్టి చూస్తే  చెన్నైలోని ఓ భారీ షాపింగ్‌ మాల్‌ హైజాక్‌ జరుగుతుంది. టెర్రరిస్ట్ లు దాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. అందులోని అమాయక ప్రజలను బెదిరిస్తూ తమ కావాల్సినవి డిమాండ్‌ చేస్తుంటారు. ఎదురుతిరిగితే, నోరు ఎత్తితే కాల్చేపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. దీంతో అంతా మౌనంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండిపోతారు. ఈ క్రమంలో విజయ్‌ ఎంట్రీ ఇస్తాడు. తనదైన స్టయిల్‌లో నెమ్మదిగా ఒక్కో టెర్రరిస్ట్ ని అంతం చేస్తూ, అంతిమంగా అందరు టెర్రరిస్ట్ ల ని ఖతం చేయడం ఈ సినిమా కథగా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. 

ఇందులో విజయ్‌ రాఘవన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సైనికుడు. తాను రాజకీయ నాయకుడిని కాదు, సోల్జర్‌ని అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. టెర్రరిస్ట్ ఎటాక్‌కి సంబంధించి రాజకీయాలకు సంబంధం ఏంటనే కోణంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది.మిలియన్స్ వ్యూస్‌తో  ట్రెండ్‌ అవుతుంది.  ఏప్రిల్‌ 13న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ టైమ్‌ విజయ్‌, పూజా హెగ్డే జోడీ కట్టడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే