మోసపోయిన బాలీవుడ్‌ నటుడు.. పాన్‌ కార్డ్ తో మోసం

Published : Apr 02, 2022, 06:20 PM IST
మోసపోయిన బాలీవుడ్‌ నటుడు.. పాన్‌ కార్డ్ తో మోసం

సారాంశం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు,జాతీయ అవార్డు విన్నర్‌ రాజ్‌కుమార్‌ రావు చిక్కుల్లో పడ్డారు ఆయన పాన్‌ కార్డ్ మిస్‌యూజ్‌ అయ్యింది. తాజాగా ఆ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు మోసగాళ్లకి దొరికిపోయారు. ఆయన పాన్‌ కార్డ్ దుర్వినియోగం కావడం ఇప్పుడు బాలీవుడ్‌కి షాకిస్తుంది. తన పాన్‌ కార్డ్ ఉపయోగించి కొందరు దుండగులు లోన్‌ తీసుకున్నారని ఆరోపించారు రాజ్‌కుమార్‌రావు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన పాన్‌ కార్డ్ తో జరిగిన మోసాన్ని వివరించారు. 

ట్విట్టర్‌లో రాజ్‌కుమార్‌ రావు చెబుతూ, `నా పాన్‌ కార్డ్ దుర్వినియోగమైంది. నా పేరుని ఉపయోగించుకుని రూ.2500లను లోన్‌గా తీసుకున్నారు. దీంతో నా క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ఈ సమస్యను పరిష్కరించాలని సిబిల్‌ని కోరుతున్నా` అని హీరో రాజ్‌కుమార్‌రావు వెల్లడించారు. దీంతో సిబిల్‌  స్పందించింది. ఆయనకు జరిగిన అసౌకర్యం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇలాంటిది జరిగిఉండాల్సింది కాదని, తాము దాన్ని పరిష్కరిస్తామని తెలిపిది. 

ఇదిలా ఉంటే రాజ్‌కుమార్‌రావు మోసపోవడం ఈ ఏడాది రెండోసారి. ఇప్పటికే ఆయన తన పేరుని దుర్వినియోగం చేశారని, రూ. మూడు కోట్లు మేరకు మోసం చేసే ఉద్దేశ్యంతో ఇతరులకు మెయిల్ పంపించారని రాజ్‌కుమార్‌రావు పేర్కొన్నారు. బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు రాజ్‌కుమార్‌రావు. ఆయన `క్వీన్‌`, `న్యూటన్‌`, `స్ట్రీ`, `లూడో`, `బధాయి దో` వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన `బధాయి దో` సినిమా మంచి ప్రశంసలందుకుంది. ఇందులో భూమి పడ్నేకర్‌ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఆయన `మోనికా`, `ఓ మై డార్లింగ్‌` చిత్రాలు చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు