Beast:'బీస్ట్' చిత్రం ఆ దేశంలో బ్యాన్...నిర్మాతకు పెద్ద దెబ్బే

Surya Prakash   | Asianet News
Published : Apr 05, 2022, 06:25 AM IST
Beast:'బీస్ట్' చిత్రం ఆ దేశంలో బ్యాన్...నిర్మాతకు పెద్ద దెబ్బే

సారాంశం

   ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని ట్యాలెంటెడ్ యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. విజయ్, నెల్సన్ ఇద్దరూ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉండటంతో ‘బీస్ట్’ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

సమ్మర్ హంగామా  విజయ్ `బీస్ట్` యష్ కేజీఎఫ్ లతో ఊపందుకోబోతోంది. మరో వారం రోజుల్లో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `బీస్ట్` రిలీజ్ కాబోతోంది.  విజయ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడీ సినిమాకు కొత్త సమస్య ఎదురైంది. ఈ సినిమాని కువైట్ లో బ్యాన్ చేసినట్లు సమాచారం.

ఈ చిత్రం చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ ని కొందరు టెర్రరిస్ట లు హైజాక్ చేసి, అక్కడకి వచ్చిన కష్టమర్స్ ని హోస్టేజీలుగా పట్టుకుంటారు. స్పై అయిన విజయ్ ఆల్రెడీ ఆ మాల్ లో ట్రాప్ అవుతాడు. అతను టెర్రరిస్ట్ లనుంచి అక్కడ వారందరినీ తప్పిస్తాడు. అయితే ఈ సినిమా ఇస్లామిక్ టెర్రరిజంను ప్రస్దావిస్తోంది. అది అరబిక్ కంట్రీస్ కు ఇష్టం లేదు. విలన్స్, టెర్రరిస్ట్ లు తమ దేశంలో ఉన్నారని చూపెడితే కువైట్ బ్యాన్ చేస్తుంది. అదే విధంగా ఈ సినిమాని కూడా కువైట్ బ్యాన్ చేసినట్లు సమాచారం. ఇంతకు ముందు దుల్కర్ నటించిన కురుప్ చిత్రం దాదాపు ఇలాంటి కారణాలతోనే బ్యాన్ చేసారు. కువైట్ లో విజయ్ కు భారీ ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఇప్పుడు నిర్మాత తలపట్టుకుని కూర్చోవాల్సిన సిట్యువేషన్.
 
 ఇక తెలుగులోను ఈ సినిమాను ఇదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు సాంగ్ వదిలారు. 'హలమితి హబీబో .. ' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీసాయి కిరణ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనిరుధ్ - జొనిత గాంధీ ఆలపించారు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన తమిళ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్ వచ్చింది.  అమాయకులైన ప్రజలను కొంతమంది తీవ్రవాదులు బంధిస్తారు. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ విజయ్ రాఘవన్ గా విజయ్ రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో ఈ ఎపిసోడ్ వస్తుందనీ .. ఈ సీన్లోనే హీరోగారి లవ్ లో హీరోయిన్ పడుతుందనే విషయం అర్థమవుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తెలుగు ట్రైలర్ ను వదలనున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది