
64వ గ్రామీ అవార్డ్స్ (Grammy Awards 2022) వేడుక అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో ఘనంగా జరిగింది. ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ గ్రామీ అవార్డు గెలుపొందారు. బెస్ట్ న్యూ ఏజ్ మ్యూజిక్ విభాగంలో లెజెండరీ డ్రమ్మర్ స్టీవర్ట్ కోప్ ల్యాండ్ తో పాటు ఈ అవార్డు గెలుపొందారు. వీరిద్దరూ కలిసి రూపొందించిన 'డివైన్ టైడ్స్' ఆల్బమ్స్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు తెచ్చిపెట్టింది. ప్రపంచ వేదికపై భారత పతాకం ఎగురవేసిన రిక్కీ కేజే ని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Modi) అభినందించారు. ట్విట్టర్ వేదికగా రిక్కీ ఘనతను కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.
ఇక రిక్కీ (Ricky Kej) గ్రామీ అవార్డు గెలుపొందినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. మేము రూపొందించిన డివైన్ టైడ్స్ ఆల్బమ్ కి గానూ... లివింగ్ లెజెండ్ స్టీవర్ట్ కోప్ ల్యాండ్ తో పాటు గ్రామీ అవార్డు గెలుచుకోవడంతో నా మనసు ప్రేమాభిమానాలతో నిండిపోయింది. ఇది నా 2వ గ్రామీ అవార్డు కాగా, స్టీవర్ట్ కి 6వ అవార్డు. నా మ్యూజిక్ విని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ కారణంగానే నేను మనగలుగుతున్నాను... అంటూ ట్వీట్ చేశారు.
ఇక 2015లో రిక్కీ 'విండ్స్ ఆఫ్ సంసార' అనే ఆల్బమ్ కి గానూ ఫస్ట్ గ్రామీ అవార్డు గెలుపొందారు. ఇక తన రెండవ గ్రామీ అవార్డు 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి అంకిత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక రిక్కీ నేపథ్యం పరిశీలిస్తే... ఈయన బెంగుళూరుకి చెందిన డెంటిస్ట్, పర్యావరణవేత్త. పంజాబీ, మార్వాడి పేరెంట్స్ కి పుట్టిన సంతానం. 1981లో నార్త్ కరోలినాలో పుట్టిన రిక్కీ కేజ్ బాల్యం, విద్యాభ్యాసం బెంగుళూరులో సాగాయి.