Bichagadu 2 Trailer : ఆసక్తికరంగా 'బిచ్చగాడు 2' ట్రైలర్.. అదిరిన యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు..

By Asianet News  |  First Published Apr 29, 2023, 4:07 PM IST

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2). చిత్రం నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉంది.  
 


ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony)కు తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.  ‘డాక్టర్ సలీమ్’, ఆ తర్వాత ‘బిచ్చగాడు’తో అలరించారు.  2016లో వచ్చిన Bichagadu చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొట్టింది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. తర్వాత పలు చిత్రాలతో అలరించిన విజయ్ ఆంటోనీ మళ్లీ ‘బిచ్చగాడు2’ను అనౌన్స్ చేశారు. దీంతో అభిమానులు, ఆడియెన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం షూటింగ్ పూర్తైన చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ కు సిద్ధం అవుతుండంతో ప్రమోషన్స్ ను షురూ చేశారు యూనిట్. ఈ సందర్భంగా వరుస అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉంది.  ప్రస్తుతం యూబ్యూబ్ లో దూసుకుపోతోంది. 

Latest Videos

ట్రైలర్ విషయానికొస్తే.. దేశంలోనే ఏడోవ స్థానంలో సంపన్నుడైన విజయ్ గురుమూర్తిగా విజయ్ ఆంటోనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఊహించని విధంగా విజయ్ గురుమూర్తి హత్యకు గురవుతాడు. అంతకముందే తన స్నేహితుడు చంద్రశేఖర్ కూడా  చనిపోతాడు. అయితే, విజయ్ గురుమూర్తిలా ఉండే సత్య అనే వ్యక్తి ఈ హత్య కేసులో నిందితుడిగా మారుతాడు. చిత్రంలో విజయ్ ప్లాస్టిక్ సర్జరీని వాడి తన రూపాన్ని మరొకరికి ఇచ్చినట్టు తెలుస్తోంది. 
అలా ఎందుకు చేశాడు. 

ఇంతకీ విజయ్ గురుమూర్తి హత్యకు ఎలా గురయ్యాడు. అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ట్రైలర్ లోని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ అందించిన  బీజీఎం సూపర్ అని చెప్పొచ్చు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.  హరీష్ పేరడి కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఆయన భార్య ఫాతిమా విజయ్ నిర్మిస్తున్నారు. మే 19న చిత్రం విడుదల కానుంది. 

பிச்சைக்காரன்2 - https://t.co/You39dqc6x
బిచ్చగాడు2 - https://t.co/BbM1dmSxKZ

BLOCKBUSTER 🟢 May19 pic.twitter.com/ZoWlhXIC0O

— vijayantony (@vijayantony)
click me!