`పొన్నియిన్‌ సెల్వన్‌ 2` ఫస్ట్ డే కలెక్షన్లు.. రికార్డులు షేక్‌

Published : Apr 29, 2023, 03:18 PM ISTUpdated : Apr 29, 2023, 04:41 PM IST
`పొన్నియిన్‌ సెల్వన్‌ 2` ఫస్ట్ డే కలెక్షన్లు.. రికార్డులు షేక్‌

సారాంశం

`Ps2` సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకుందని అంటున్నారు. ఈ ఏడాది కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని ట్రేడ్‌ వర్గాలు, క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నాయి. 

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్ `పొన్నియిన్‌ సెల్వన్‌2`. తనని తాను నిరూపించుకునే సినిమా ఇది. మణిరత్నం ఈజ్‌ బ్యాక్‌ అని చాటి చెప్పే చిత్రమిది. మొదటి భాగం(పొన్నియిన్‌ సెల్వన్‌ 1)కి డివైడ్‌ టాక్‌ వచ్చింది. అర్థం కాలేదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. కన్‌ఫ్యూజన్‌గా ఉందన్నారు. కానీ రెండో పార్ట్ కి మాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మొదటి భాగం కంటే చాలా వరకు క్లారిటీగా రూపొందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణిరత్నం. మొదటి భాగానికి కంటిన్యూటీ కావడంతో అసలు కథ ఇందులోనే ఉండటంతో సినిమా చాలా వరకు అర్థమయ్యేలా ఉంది. కొంత లాగ్‌ సినిమాకి మైనస్‌, అలాగే కొంత క్లారిటీ మిస్‌ కావడం కూడా ఈ సినిమాకి డ్రా బ్యాక్‌ కానీ చాలా వరకు సినిమా కనెక్ట్ అయ్యేలా ఉంది.

సినిమాలో ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేశాడు దర్శకుడు. సినిమా ఆసాంతం ఎమోషనల్‌ రైడ్‌గా చేసే ప్రయత్నం చేశారు. ఓ వైపు ప్రేమ, మరోవైపు కుటుంబ అనుబంధాలకు పెద్ద పీట వేశారు. అది కామన్‌ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా తెరపై ఆవిష్కరించడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్‌. అదే ఈ సినిమాకి కలిసి వస్తుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటేందుకు దోహద పడుతుంది. తాజాగా ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకుందని అంటున్నారు. ఈ ఏడాది కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని ట్రేడ్‌ వర్గాలు, క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నాయి. 

ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.54కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందట. ఇది ఈ ఏడాది ఇప్పటి వరకు కోలీవుడ్‌ లో హైయ్యేస్ట్ గ్రాస్‌ అని అంటున్నారు. `తినువు`, `వారసుడు`లను అధిగమించింది. ఇక తమిళనాడు దాదాపు రూ.19కోట్లకుపైగా వసూలు చేసిందట. ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి రూ.24కోట్లు కలెక్షన్లు వచ్చాయని అంటున్నారు. తెలుగు స్టేట్స్ లో 2.80 కోట్లు, కేరళాలో రూ.2.80కోట్లు, కర్నాటకలో రూ.4కోట్లు, నార్త్, ఇతర స్టేట్స్ లో మరో రెండు కోట్లు వసూలు చేసిందట. 

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 54కోట్ల గ్రాస్‌, 26కోట్ల షేర్‌ సాధించిందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా 170కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో విడుదలైంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్‌తో `పీఎస్‌1, పీఎస్‌ 2` చిత్రాలను రూపొందించారు. ఈ లెక్కన రెండో భాగం బడ్జెట్‌ రూ.250కోట్ల వరకు అంచనా వేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్‌ని బట్టి చూస్తే ఈ చిత్రం ఐదు వందల కోట్లకు రీచ్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి.  ఇదిలా ఉంటే మొదటి భాగం కంటే ఇది తక్కువే ఓపెనింగ్స్ రాబట్టడం గమనార్హం. అది రూ.80కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది.

మణిరత్నం రూపొందించిన ఈ చిత్రం కల్కి రాసిన `పొన్నియిన్‌ సెల్వన్‌` నవల ఆధారంగా హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, శోభితా దూళిపాల, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Dec 16: అమూల్య ప్రేమ వేషాలు కళ్లారా చూసిన పెద్దోడు, నాన్నకి చెప్పేందుకు సిద్ధం