'బిచ్చగాడు -2' ...మూడు రోజుల కలెక్షన్స్.. ‘ఏజెంట్’క్లోజింగ్ కలెక్షన్స్ కన్నా ఎక్కువే

Published : May 22, 2023, 04:07 PM IST
  'బిచ్చగాడు -2' ...మూడు రోజుల కలెక్షన్స్.. ‘ఏజెంట్’క్లోజింగ్ కలెక్షన్స్ కన్నా ఎక్కువే

సారాంశం

  'బిచ్చగాడు-2' చిత్రం పాజిటివ్​ టాక్​ తెచ్చుకుని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను అందుకుంటున్నట్లు తెలిసింది. మొదటి రోజు మంచి కలెక్షన్స్​ను అందుకున్న ఈ చిత్రం మూడో రోజు కూడా జోరు చూపించింది.   


‘బిచ్చగాడు 2 ‘ మొన్న శుక్రవారం విడుదల అయ్యింది .భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి యావరేజి టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వసూళ్లు మాత్రం సూపర్ హిట్  రేంజ్ లో ఉన్నాయి. మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండు రోజులకు కలిపి 7 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. మూడో రోజుల కలెక్షన్స్ 9.5 కోట్లు అని అఫీషియల్ గానే ప్రకటించారు. 

అందుకు సాక్ష్యం  మూడవ రోజు అయితే ఈ సినిమాకి ప్రధాన నగరాల్లో అదనపు థియేటర్స్ మరియు అదనపు షోస్ ని పెంచేసారు. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్స్ దుమ్ము రేపనున్నాయి. పెద్దగా డ్రాప్ ఉండదంటున్నారు.

మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' చేశారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' చేశారు. అయితే... రెండు కథల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండో కథలో కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, థ్రిల్ ఇచ్చే అంశాలు ఉన్నాయి. యాక్షన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు అదే కలిసి వచ్చింది.ఇంటర్వెల్ తర్వాత ఆ టెంపో మిస్ అయ్యింది. సామాజిక సేవ, సందేశం మీద దృష్టి పెట్టడంతో అసలు కథ పక్కకు వెళ్ళింది. యాక్షన్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాలన్స్ చేయడంలో విజయ్ ఆంటోనీ కొంచెం తడబడినా క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకున్నారు.

అలాగే ఈ సినిమా రీసెంట్ గా విడుదలైన అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ మరియు నాగ చైతన్య ‘కస్టడీ’ చిత్రాల క్లోసింగ్ కలెక్షన్స్ ని మూడు రోజుల్లో దాటేసింది.ఈ రెండు సినిమాల క్లోజింగ్ కలెక్షన్స్ 7 కోట్ల రూపాయిల లోపే అనే విషయం అందరికీ తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది