Sarath Babu Death: వారసులు లేరు అయినా.. శరత్ బాబు ఇంట ఆస్తి తగాదాలు..?

Published : May 22, 2023, 03:32 PM IST
Sarath Babu Death: వారసులు లేరు అయినా.. శరత్ బాబు ఇంట ఆస్తి తగాదాలు..?

సారాంశం

తీవ్ర విషాదం.. సీనీ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఎన్నో రోజులు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ప్రాణాలకోసం పోరాడి.. తుదిశ్వాస విడిచారు. ఈక్రమంలో ఆయన ఇంట్లో ఆస్తితగాదాలు మొదలైనట్టు పుకార్లు బయటకు వస్తున్నాయి. 


సీనియర్ నటుడు శరత్ బాబు కన్ను మూశారు. ఈరోజు మధ్యాహ్నం 1.32 గంటలకు ఆయన మరణించినట్టు ప్రకటన వచ్చింది. ఎన్నో రోజులు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించడంతో.. శరత్ కుమార్ కన్ను మూశారు.. ఆయన మరణంతో ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి లోనయ్యింది. ముందుగా అనారోగ్యంతో చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్నశరత్ బాబు పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. బెంగళూరు తరలించారు. అక్కడ కూడా ఆయన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. వెంటనే హైదరాబాద్ తరలించారు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా. . మధ్యలో శరత్ బాబు చనిపోయారని న్యూస్ బయటకు వచ్చింది. కాని ఆమన బాగానే ఉన్నారని శరత్ బాబు సోదరి ప్రకటించారు. ఇక అప్పటి నుంచి విషమంగా ఉన్నా.. ట్రీట్మెంట్ అందుతూనే ఉంది శరత్ బాబుకు. ఇక తాజాగా శరత్ బాబు పరిస్థితి ఇంకా విషమం కావడంతో.. కన్నుమూశారు స్టార్ నటుడు. 

ఇక శరత్ బాబు ఆనారోగ్యంబారిన పడినప్పటి నుంచీ.. ఆయన  ఇంట ఆస్థి గొడవలు స్టార్ట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. శరత్ బాబు మూడు పెళ్ళీళ్లు చేసుకున్నారు. అయినా కూడా ఆయనకంటూ వారసులే లేరు.  శ‌ర‌త్ బాబుకి వార‌సులెవ‌రూ కాని  ఆయ‌న‌కున్న ఆస్తిని అన్న‌ద‌మ్ముల బిడ్డ‌ల‌కు, తోబుట్టువుల‌కు 13 వాటాలుగా చేసి రాసిచ్చార‌ని సమాచారం. అయితే తన బంధువులకు ఆస్తి రాసిచ్చిన తరువాత కూడా ఆయనకంటూ సోంతంగా చాలా ఆస్తి ఉన్నట్టు సమాచారం. దాంతో అది ఎవరికి చెందాలి అన్నదానిపై గొడవలు వస్తున్నట్టు తెలుస్తోంది. 

అంతే కాదు చాలా కాలంగా ప్రైవేట్ ఆస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న శరత్ బాబు హాస్పిటల్ ఖర్చులన్నీ బందువులే భరిస్తూ వచ్చారు. ఆయ‌న కోలుకొని.. మ‌ళ్లీ త‌మ‌కు మిగిలిన ఆ ఆస్తి కూడా రాసిస్తార‌న్న ఆశ‌తో వారు ఉన్నట్టు తెలిసింది. అయితే ఇంతలో ఆయన మరణంతో.. ఈ గొడవలు ఇంకా పెద్దవి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో  ఆసుప‌త్రి బిల్లుల‌న్నీ ఎవ‌రికి వాళ్లు మీద వేసుకొంటున్నార‌ని టాక్‌. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు  కాని ఇవన్నీ చెన్నైలో తేల్చుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

నటుడిగా సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేసిన  శ‌ర‌త్ బాబుకి.. పర్సనల్ లైఫ్.. మారీడ్ లైఫ్ లో మాత్రం అన్నీ  ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న..  ఆయ‌న‌కు పిల్ల‌లు లేరు. కాని శరత్ బాబు మాత్రం సోద‌రుల బిడ్డ‌ల్ని త‌న సొంత బిడ్డ‌లుగా చూసుకొంటూ వ‌చ్చారు. కాక‌పోతే… ఆస్తిపాస్తులు మాత్రం బాగానే సంపాదించిన‌ట్టు టాక్‌. హైద‌రాబాద్‌, చెన్నై , బెంగళూర్ లో ఆయ‌న‌కు ఇళ్లూ, స్థ‌లాలూ, షాపింగ్ మాల్స్ ఉన్నాయట.. దాంతో వాటి గురించే ప్రస్తుతం తగాదాలు స్టార్ట్  అయినట్టు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?