
రానా దగ్గుబాటి కల్లు దావత్ చేసకున్నారు. కడుపునిండా కల్లుతాగి.. సందడి సందడి చేశారు. అంతే కాదు..ఆయనకు కల్లు దావత్ ఇచ్చింది ఎవరో కాదు.. బిగ్ బాస్ ఫేమ్.. ప్రముఖ యూట్యూబర్ గంగవ్వ. అవును ఇద్దరుస్టార్లు కూడా కలిసి కల్లుదావత్ చేసుకున్నారు. ఇంతకీ వీరు ఎందుకు కలిశారు.. ఎందుకు పార్టీ చేసుకున్నారు..? యూట్యూబర్ గా మంచి జోరు మీద ఉంది గంగవ్వ. 60 ఏళ్లు దాటినా ఏమాత్రం హుషారు తగ్గకుండా..యంగ్ స్టార్స్ కు కూడా షాక్ ఇచ్చేలా వీడియోలు చేస్తుంది గంగవ్వ. మై విలేజ్ షో ద్వారా గంగవ్వ ఎంతా ఫేమస్ అయ్యిందంటే.. ఆమెను వెతుక్కుంటూ వచ్చి బిగ్ బాస్ 4 లోకి తీసుకున్నారు. ఇక బిగ్ బాస్ తరువాత ఇంకా పాపులర్ అయ్యింది గంగవ్వ. వరుసగా సినిమా అవకాశాలు కూడా ఆమోను వెతుక్కుంటూ వస్తున్నాయి.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా గంగవ్వకు అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ లో గంగవ్వ అస్సలు ఖాళీ అనేది లేకుండా బిజీగా గడిపేస్తోంది. ఇస్మార్ట్ శంకర్, లవ్‌స్టోరి లాంటి సినిమాల్లో నటించిన విలేజ్ బామ్మ.. రీసెంట్ గా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. అంతే కాదు చిన్న పెద్దా అని లేకుండా అందరు స్టార్లు గంగవ్వతో ప్రమోషన్స్ చేయించుకోవడం కోసం ఎగబడుతున్నారు. గంగవ్వ మై విలేజ్ షోలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు స్టార్స్.
అందరు స్టార్ల మదిరిగానే తాజాగా రానా కూడా తన సినిమా ప్రమోషన్ కోసం గంగవ్వని కలిశాడు. ఈ సందర్భంగా రానాకు మంచి కల్లు దావత్ ఇచ్చింది గంగవ్వ.. స్వయంగా ఆయనకు కల్లు పోసి.. తాగించి.. రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రస్తుతం రానా సమర్పణలో తిరువీర్ హీరోగా నటించిన పరేషాన్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 2న థియేటర్లను పలుకరించబోతోంది. వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మై విలేష్ షో టీమ్‌తో సందడి చేశాడు రానా టీమ్.
పరేషాన్ టీమ్‌తో కలిసి గంగవ్వ ఊరికి వచ్చాడు రానా. పల్లెటూరి వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశాడు రానా. రానా ఉన్నాడంటే అక్కడ ఎంత సందడి ఉంటోంది ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న ఈ హీరో.. గంగవ్వతో కూడా అలానే కలిసిపోయి.. దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. రానా చేత కల్లు తాగించింది.