Vijay Arabic Kuthu Song: దుమ్మురేపుతున్న విజయ్ అరబిక్ కుతు సాంగ్... పూనకాలతో ఊగిపోతున్న ఫ్యాన్స్...

Published : Feb 27, 2022, 02:06 PM IST
Vijay Arabic Kuthu Song: దుమ్మురేపుతున్న విజయ్ అరబిక్ కుతు సాంగ్... పూనకాలతో ఊగిపోతున్న ఫ్యాన్స్...

సారాంశం

తమిళ దళపతి విజయ్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈలోపు విజయ్ బీస్ట్ సినిమా నుంచి వచ్చే ప్రతీ అప్ డేట్ ను హైలెట్ చేస్తున్నారు. భారీగారె స్పాండ్ అవుతున్నారు.

తమిళ దళపతి విజయ్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈలోపు విజయ్ బీస్ట్ సినిమా నుంచి వచ్చే ప్రతీ అప్ డేట్ ను హైలెట్ చేస్తున్నారు. భారీగారె స్పాండ్ అవుతున్నారు.

తమిళ స్టార్‌ విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా భీస్ట్. దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.  షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా నుంచి రీసెంట్ గా  విడుదలైన అరబిక్‌ కుతు సాంగ్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది... యూట్యూబ్‌ను దడదడలాడిస్తోంది.

 

అరవికుతు సాంగ్ రిలీజ్ అయిన  48 గంటల్లోనే  గ్లోబల్‌ టాప్‌ సాంగ్స్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఈ పాట ఇప్పుడు ఏకంగా 100మిలియన్‌ వ్యూస్‌తో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. రిలీజైన 4రోజుల్లోనే 50మిలియన్‌ (5 కోట్లు) వ్యూస్‌, వారం రోజుల్లోనే 70 మిలియన్‌(7 కోట్ల) వ్యూస్‌, సాదించింది. ఇక రీసెంట్ గా 12 రోజుల్లో 100మిలియన్‌ వ్యూస్‌ అంటే 10 కోట్ల ఫ్యూస్ తో దడదడలాడించింది. వ్యూవర్ షిప్ లో ఇంకా పరిగెడుతూనే ఉంది సాంగ్.

 

అంతేకాదు. ఈ అరబికుతు సాంగ్ దాదాపు 40 లక్షలకు దగ్గరగా లైక్స్ ను సాధించింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ అరబిక్‌ కుతు సాంగ్ ట్యూన్ మోరుమ్రోగుతోంది. అంతటా హలమితి హబిబో అంటూ కామన్‌ పీపుల్‌ నుంచి సెలబ్రిటీల వరకు ఈ ట్యూన్‌ రీల్స్‌తో రచ్చ చేస్తున్నారు. ఈ సాంగ్ ను  తమిళ క్రేజీ యంగ్  మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ కంపోజ్ చేసిన ఈ పాటకు మరో స్పెషాలిటీ ఉంది. ఈ సాంగ్ ను యంగ్ హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించారు.

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద