
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. చాలా ఓపిగ్గా.. షూటింగ్స్ లో పాల్గొంటూ వస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ (Acharya) మూవీని రిలీజ్ కు సిద్ధంగా చేశారు మేకర్స్.. కాగా ‘గాడ్ ఫాదర్’ మూవీ చిత్రీకరణ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. చిరు కూడా షూటింగ్స్ లో స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ అందించింది ‘భోళా శంకర్’ మూవీ టీం. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ ను ఖరారు చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.
ఈ శివరాత్రి సందర్భంగా ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. మార్చి 1న ఉదయం 9:05 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ‘ఈ మహాశివరాత్రికి మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. భోళా మెగా వైబ్స్ రాన్నాయి’ అంటూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ వారు ట్విట్టర్ లో అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తిని కలిపించింది.
‘భోళా శంకర్’ మూవీ తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్ వెర్షన్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నది. హీరోయిన్లుగా చిరంజీవి, కీర్తి సురేష్ మరియు తమన్నా భాటియా నటిస్తున్నారు. ప్రధాన పాత్రలలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్ కనిపించనున్నారు. సాగర్ మహతి సంగీతం అందించగా, డడ్లీ సినిమాటోగ్రఫీగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మెగాస్టార్ నటించిన ‘ఆచార్య’ ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక నెక్ట్స్ మూవీ గాడ్ ఫాదర్ కూడా సెట్స్ లో ఉంది. ఈ మూవీ చిత్రీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పూర్తికావస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మెహార్ రమేష్ సినిమా ‘భోళా శంకర్’కు రెడీ అవుతున్నారు చిరంజీవి. ఈమూవీ కూడా సెట్స్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. అలాగే బాబీతో మరో మాస్ మూవీకి కమిట్ అయ్యారు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది. మరో వైపు వెంకీ కుడుములతో కూడా సినిమా చేనున్నట్టు సమాచారం.