భర్త నుంచి కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న నయనతార, లేట్ గా వెల్లడించిన లేడీ సూపర్ స్టార్

By Mahesh Jujjuri  |  First Published Dec 1, 2023, 8:29 AM IST

కోలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గాపేరు తెచ్చుకున్నారు నయనతార-విఘ్నేష్ శివన్. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. తాజాగా నయన్ కు కాస్ట్లీ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేశారు విఘ్నేష్.


రీసెంట్ గా తన 39వ బర్త్ డే జరుపుకుంది  లేడీ సూపర్ స్టార్ నయనతార. సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైనఇమేజ్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ... ఇంత ఏజ్ వచ్చినా.. ఏమాత్రం గ్లామర్ కాని..ఫిట్ నెస్ కాని కోల్పోకుండా.. మెయింటేన్ చేస్తోంది. ఇక ఆమె  పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఖరీదైన గిఫ్టుతో సర్‌ప్రైజ్ చేశాడు. నయన్.. రీసెంట్ గా జరిగిన తన పుట్టినరోజును భర్త, పిల్లలతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది

అబ్బాస్ తో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అని తెలుసా..?

Latest Videos

అయితే తన భర్త ఇచ్చిన గిప్ట్ విషయంలో మాత్రం ముందుగా ఓపెన్ అవ్వలేదు నయన్. ఆతరువాత స్పందించింది. గిఫ్ట్ విషయాన్ని తన పుట్టిన రోజున వెల్లడించలేదు నయనతార.  తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది నయన్. విఘ్నేష్ శివన్.. తనకు ఇచ్చిన గిఫ్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించింది  నయనతార. అయితే కంప్లీట్ గా తన గిప్ట్ ను వెల్లడించలేదు బ్యూటీ. పూర్తిగా చూపించకుండా.. బ్లర్ ఇమేజ్.. అది కూడా కారు లోగోను తన ఇన్ స్టాలో పోస్ట్ గా పెట్టింది నయన్. ఇక నెటిజన్లు ఊరుకుంటారా.. ఆ గిఫ్ట్ ఏంటో కనిపెట్టేశారు. విఘ్నేష్ శివన్.. నయన్ కోసం లగ్జరీ మెర్సిడీజ్ మేబ్యాచ్ ఎస్ క్లాస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

అంతే కాదు ఆ కారు కాస్ట్ కూడా పెట్టేస్తున్నారు ఫ్యాన్స్. ఆ కారు  విలువ దాదాపు ర 2 కోట్ల 70 లక్షల వరకూ  ఉంటుందని అంచన. ఆ కారుపై ఉన్న మెర్సిడీజ్ సింబల్‌ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నయనతార.. దానికి క్యూట్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.  ఈ పోస్ట్ కు సబంధించిన ఓ చిన్న నోట్ ను కూడా రాసిందినయనతార.  ఇంటికి స్వాగతం బ్యూటీ. ఈ బర్త్ డే గిఫ్ట్‌కు థ్యాంక్స్ మై డియర్ హజ్బెండ్. లవ్ యూ’ అని పోస్ట్‌ను షేర్ చేసింది నయనతార. అయితే ఈ కారు నయన్ పుట్టిన రోజు నాటికి రాలేదని.. ఆరర్డ్ ఇవ్వగా.. అది తాజాగా డెలివరి అయ్యిందని సమాచారం. ఇక డబ్బున్నోళ్ళు ఇలాంటిగిప్ట్స్ ఎన్నైనా ఇచ్చుకుంటారు అంటూ..సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. 

ఇక నయన్ సినిమాల విషయానికిస్తే.. ఈమధ్య జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది నయనతార. ఈమూవీతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఇక ఆమె డిమాండ్ మరింత పెరిగింది. దాంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట బ్యూటీ. ప్రస్తుతం తన కెరీర్‌లోని 75వ చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అన్నపూర్ణి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌పై నయన్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఇక విఘ్నేష్ శివన్ విషయానికొస్తే.. కాతువాకులా రెండు కాదల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు విఘ్నేష్. ప్రస్తుతం అతని చేతిలో మరే సినిమా లేదని తెలుస్తోంది. 

click me!