సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరో , దిల్ రాజు ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు

Published : Dec 01, 2023, 06:59 AM IST
సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరో , దిల్ రాజు ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరోస్ వరుసగా పెళ్ళిపీటలెక్కుతున్నారు. ఈ ఏడాది శర్వానంద్ తో పాటు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్ళి కూడా అట్టహాసంగా జరిగింది. ఇక  ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. 

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. సరిగ్గా నెల క్రితం.. నవంబర్1న హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.  ఆ తర్వాత వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.

నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు. దిల్ రాజు కు కుమారుడు లేకపోవడంతో.. తన వారసుడిగా శిరీష్ కొడుకు అశిష్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో కూడా రాబోతున్నాడు. ఈలోపు ముచ్చటగా మూడో సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఇక మూడు సినిమాలు కూడా కంప్లీట్ చేయనే లేదు.. అప్పుడు ఈ కుర్ర హీరో పెళ్ళి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. 

ఆశిష్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు అద్విత రెడ్డితో ఆశిష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. చాలా సైలెంట్ గా ఎక్కువ ఆర్బాటం లేకుండా.. ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేకుండా.. ఆశిష్ – అద్విత నిశ్చితార్థాన్ని ముగించారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ కు  చెందిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్స్, ప్రముఖులు ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వచ్చే ఏడాది పిబ్రవరిలో వీరి  వివాహం కూడా జరగనుందని సమాచారం.

డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి.. నిర్మాతగా మారాడుదిల్ రాజు.  టాలీవుడ్ లో తాను చేసినప్రతీసినిమా సూపర్ హిట్ అవ్వడంతో..  అగ్ర నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా  సినిమాలతో బిజీగా ఉన్నారు దిల్ రాజు. కోట్లకు అదిపతిగా మారిన ఈ స్టార్ ప్రొడ్యసర్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది