Bigg Boss Telugu 7 : ఫినాలే రేస్.. అదరగొట్టిన రైతుబిడ్డ.. అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు

Sreeharsha Gopagani | Published : Nov 30, 2023 10:51 PM
Bigg Boss Telugu 7 : ఫినాలే రేస్.. అదరగొట్టిన రైతుబిడ్డ..  అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు

బిగ్ బాస్ లో ప్రస్తుతం ఫినాలె పవర్ అస్త్ర రేసు రసవత్తరంగా సాగుతోంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు అదరిపోయాయి. ఈ క్రమంలో యావర్ కంటతడి పెట్టుకున్నారు. అమరే అందుకు కారణమని మిగితా సభ్యులు అనుకోవడం గమనార్హం.   

బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్  ప్రస్తుతం రసవత్తరంగా జరుగుతోంది. Bigg Boss ఫినాలే అస్త్ర టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హౌజ్ లో ప్రస్తుతం మొత్తం ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే మిగిలారు. వీరిలో నిన్నటి వరకు జరిగిన టాక్స్ లో ప్రియాంక, శోభాశెట్టి, శివాజీలు నేటితో సంచాలకులుగా మారారు. ఈరోజు ఏడు, ఎనిమిది, తొమ్మిదో టాస్క్ లు ఈరోజు చాలా ఆసక్తికరంగా మారింది. 

బిగ్ బాస్ ఇచ్చిన క్రికెట్ గేమ్ టాస్క్ లో అమర్ దీప్ టాప్ లో  నిలిచారు. తర్వాత అర్జున్, ప్రశాంత్, యావర్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఆ తర్వాతి టాస్క్ ‘తప్పింకుచో రాజా’లో ప్రశాంత్ అదరగొట్టారు. అలాగే అమర్ దీప్ కూడా చక్కగా ఆడారు. యావర్, గౌతమ్, అర్జున్ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇదే సమయంలో అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని శోభాశెట్టి, ప్రియాంక అభిప్రాయ పడ్డారు. 

ఆ టాస్క్ లో కాళ్లకు లాక్స్ తో కట్టిన చైన్ లను పోటీదారులు విడిపించుకోవాల్సి ఉంటుంది. అయితే కీ మొదట తీసుకున్న ప్రశాంత్ టార్గెట్ ను రీచ్ అయ్యారు. ఆ వెంటనే తిరిగి వెళ్లిన అమర్ దీప్ మాత్రం కీస్ ను గందరగొళంగా పడేయడంతో అర్జున్ చివర్లో మిగిలిపోయాడు. ఆ తర్వాత టాస్క్ లోన్ అర్జున్ తీరును తప్పుబట్టడంతో శివాజీతో వాగ్వాదం జరిగింది. అయితే..  యావర్ తన పాయింట్స్ ను కోల్పోవడంతో కంటతడి పెట్టాడు. ఆ పాయింట్స్ ను పల్లవి ప్రశాంత్ కు ఇవ్వడంతో అమర్ దీప్ కాస్తా అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

ఇక పల్లవి ప్రశాంత్ మాత్రం ప్రతి టాస్క్ లోనూ అదరగొడుతున్నాడు. ఈరోజు జరిగిన టాస్క్ ల్లో ప్రతి గేమ్ లో తన నైపుణ్యాన్ని కనబర్చిరారు. సూపర్ గా ఆడి ఆకట్టుకున్నారు.  మరోవైపు అమర్ దీప్ కూడా టాస్క్ లతో ఆకట్టుకుంటున్నారు. మంచి స్కోర్ చేస్తున్నారు. దీంతో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్  బిగ్ బాస్ ఫినాలే అస్త్ర విన్నర్ గా తెలుస్తోంది. ఇకరేపటి టాస్క్ లను బట్టి ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి. 

Read more Articles on
click me!