బయోపిక్ కోసం బరువు తగ్గుతోంది!

Published : Apr 12, 2019, 04:49 PM IST
బయోపిక్ కోసం బరువు తగ్గుతోంది!

సారాంశం

మరో బయోపి కోసం విద్యాబాలన్ సిద్ధమౌతోంది. బరువు తగ్గించుకోవడానికి జిమ్ లో కసరత్తులు చేస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ తో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఎవరు ఏమనుకున్నా సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ హీరోయిన్ చాలా ఇష్టంతో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది.

ఇక సినిమా ఎంత డిజాస్టర్ అయినా నాకు సంతృప్తిని ఇచ్చిన పాత్ర బసవతారకం అని చాలా సార్లు వివరణ ఇచ్చింది. ఇకపోతే నెక్స్ట్ మరో బయోపి కోసం విద్యాబాలన్ సిద్ధమౌతోంది. బరువు తగ్గించుకోవడానికి జిమ్ లో కసరత్తులు చేస్తోంది. ఇండియన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాజీ ప్రాధాని ఇందిరా గాంధీ జీవిత ఆధారంగా తెరకెక్కిస్తోన్న కథ కోసం ఇటీవల విద్యా బాలన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. 

అయితే ఈ కథను వెబ్ సిరీస్ రూపంలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఈ బయోపిక్ ను విడుదల చేయనున్నారు. త్వరలో ఈ వెబ్ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. విలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?