ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి అయిపోయిందట. అయితే ఈ సినిమాకు 'మంచి రోజులు వచ్చాయి' అనే టైటిల్‌ను చిత్ర టీమ్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
దర్శకుడు మారుతి 'ఏక్ మినీ కథ' హీరో సంతోష్ శోభన్‌తో ఓ చిన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి విభిన్నమైన టైటిల్‌ను ఫైననల్ చేసిన్నట్టు తెలుస్తోంది. సంతోష్ శోభన్ - మెహరీన్ జంటగా ఓటీటీ కోసం మారుతి ఈ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి అయిపోయిందట. అయితే ఈ సినిమాకు 'మంచి రోజులు వచ్చాయి' అనే టైటిల్‌ను చిత్ర టీమ్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ చూస్తుంటే గత ఏడాది నుంచి కరోనా కారణంగా ఎదుర్కొంటున్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారని భావిస్తున్నారు. త్వరలో టైటిల్ ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్ నిర్మిస్తోంది. లాక్ డౌన్ ఎత్తకముందే ఈ సినిమా షూటింగ్
మొదలెట్టేసారు. కరోనాకు సంభందించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఓ కాలనీలో జరిగే ప్రేమకథ ఇది. రెండు ఇళ్ల మధ్య నడిచే రొమాంటిక్ డ్రామా. హీరోయిన్ గా మెహరీన్ కనిపించబోతోంది. అయితే ఈ సినిమాకి మారుతి డైరక్టర్ కాదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే. అప్పట్లో `ప్రేమకథా చిత్రమ్` కి మారుతి దర్శకత్వ పర్యవేక్షణ చేసారు. ఆ తర్వాత అలా చేస్తున్న సినిమా ఇదే.
జులైలో.. `పక్కా కమర్షియల్` షూటింగ్ మొదలవుతుంది. ఈలోగా… ఈ లవ్ స్టోరీని ఫినిష్ చేయాలని చూస్తున్నాడు మారుతి. ఓ నెలలో… సినిమా పూర్తి చేసి రిలీజ్ కు పెట్టేస్తారన్నమాట. తక్కువ బడ్జెట్ లో సాగే కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమా ఇది. అందుకే ఇప్పుడు అందరూ దటీజ్ మారుతి..మిగతా డైరక్టర్స్ ఆయన రూట్ లో వెళ్లటం బెస్ట్ అంటున్నారు.