అప్పుడు నా మీద నాకే అసహ్యం వేసేది.. విద్యాబాలన్ కామెంట్స్!

Published : Apr 16, 2019, 09:58 AM IST
అప్పుడు నా మీద నాకే అసహ్యం వేసేది.. విద్యాబాలన్ కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒకప్పుడు తనను చూస్తే తనకే అసహ్యం వేసేదంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది. 

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒకప్పుడు తనను చూస్తే తనకే అసహ్యం వేసేదంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు విద్యాబాలన్ తన శరీర బరువు విషయంలో చాలా విమర్శలను ఎదుర్కొంది.

తనకు థైరాయిడ్ సమస్య ఉందని, డైటింగ్ చేసినా.. సమస్య పరిష్కారం కావడం లేదని విద్యాబాలన్ చెప్పేది. తాజాగా ఆమె బాడీ షేమింగ్ గురించి మీడియాతో మాట్లాడుతూ.. తనకు థైరాయిడ్ సమస్య వేధిస్తున్న సమయంలో తనపై తనకే అసహ్యం వేసేదని విద్యాబాలన్ అన్నారు. 

తన శరీరంతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఎంతో విరక్తిగా అనిపించేదని, తన శరీరాన్ని మార్చుకోగలిగినప్పుడే అందరూ ఆదరిస్తారని అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే అంతకముందు సన్నగా ఉన్నప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నానని.. అందుకే ఇటువంటి విమర్శలను పక్కనపెట్టి తన సంతృప్తి కోసం శరీర బరువును తగ్గించుకునే ప్రయత్నం ప్రారంభించానని చెప్పుకొచ్చింది.

దానికి చాలా సమయం పట్టిందని.. ఇప్పుడు ఎంతోఆనందంగా ఉన్నట్లు.. తనకు తానే ఎంతో అందంగా కనిపిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు తన శరీరం గురించి కామెంట్స్ చేయాలని ఎవరూ అనుకోరంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu : శ్రుతి హాసన్ ముందు అలీ ని ఇరికించిన మహేష్ బాబు, సూపర్ స్టార్ మామూలోడు కాదు?
రామ్ పోతినేనితో సినిమా చేసిన డైరెక్టర్ అరెస్ట్ కి ఆదేశాలు ? అసలేం జరిగింది, క్లారిటీ ఇదే