ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

Published : Oct 17, 2018, 12:39 PM ISTUpdated : Oct 17, 2018, 12:42 PM IST
ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

సారాంశం

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్‌ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేస్తోన్న తారల గెటప్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది చిత్రబృందం.

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్‌ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేస్తోన్న 
తారల గెటప్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది చిత్రబృందం.

తాజాగా ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్ర పోషిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ లుక్ బయటకి వచ్చింది. బసవతారకం మాదిరి తయారై అద్దం ముందు కూర్చొని తనను తానే చూసుకుంటున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది విద్యాబాలన్. ఫోటోపై 'నేనేం చూస్తున్నాను'' అని రాసుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  జనవరి 9న ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ఒక భాగం, జనవరి 24న ఎన్టీఆర్‌ మహానాయకుడిగా రెండో భాగాన్ని విడుదల చేయనున్నారు.

సినిమాలో హరికృష్ణ పాత్రలో కల్యాణ్  రామ్, చంద్రబాబు నాయుడిగా రానా, శ్రీదేవి పాత్రలో రకుల్, ఏఎన్నార్ గా సుమంత్ నటిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?