పురుషుల కోసం 'మీటూ'!

By Udayavani DhuliFirst Published Oct 17, 2018, 11:40 AM IST
Highlights

సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. మహిళలపై పురుషులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని 
నడిపిస్తున్నారు. అయితే ఈ ఉద్యమాన్ని అదనుగా చేసుకొని కొందరు మహిళలు కావాలని కొందరు మగాళ్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. మహిళలపై పురుషులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని  నడిపిస్తున్నారు. అయితే ఈ ఉద్యమాన్ని అదనుగా చేసుకొని కొందరు మహిళలు కావాలని కొందరు మగాళ్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో పురుషుల కోసం మీటూ అంటూ కొత్త ఉద్యమం మొదలైంది. తమిళనాడులో దర్శకుడు వారాహి ఈ మూవ్మెంట్ ని మొదలుపెట్టాడు. అతడు తెలుగమ్మాయి శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. ఈ ఉద్యమం గురించి మరిన్ని విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు.

''శ్రీరెడ్డి తప్పుడు ఉద్దేశాలతో అబద్ధపు ఆరోపణలు చేయడానికి తమినాడుకి వచ్చింది. ఆమె విషయంలో మొదట్లోనే మేము నిరసన తెలిపాం. శ్రీరెడ్డితో పాటు చాలా మంది తప్పుడు ఉద్దేశంతో ప్రముఖులని టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది అమాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఇదేళ్ల క్రితం నాకు తెలిసిన ఓ బిజినెస్ మెన్ ఓ నటితో శృంగారంలో పాల్గొన్నాడు.

ఆమె కూడా ఇష్టాపూర్వకంగానే పాల్గొంది. కానీ ఇప్పుడు మాత్రం నీ విషయాలు బయటపెడతా.. అంటూ మూడు కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఆ వ్యక్తి విషయాన్ని నాతో చెప్పి బాధపడ్డాడు. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. అలాంటి వారికి అండగా నిలబడడం కోసం 'మీటూ మెన్' అనే ఉద్యమం మొదలుపెట్టామని'' వారాహి చెప్పుకొచ్చారు. 

click me!