విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ నటించని జోనర్ చిత్రం ఇది. దీనితో సైంధవ్ చిత్రం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన టీజర్ అంచనాలని రెట్టింపుచేసే విధంగా, ఉత్కంఠ పెంచే విధంగా ఉందని చెప్పాలి.
టీజర్ లో వెంకటేష్ పెర్ఫామెన్స్ చూస్తే మునుపెన్నడూ చూడని వెంకీ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. క్రైం సన్నివేశాలు టీజర్ లో వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. టీజర్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర సర్ప్రైజ్ ప్యాకేజ్ అనే చెప్పాలి. అతడి పాత్రని దర్శకుడు శైలేష్ చాలా బ్రూతల్ గా తీర్చిదిద్దినట్లు ఉన్నారు.
వ్యాపార సంస్థల కోసం క్రైమ్ చేసిపెట్టే వ్యక్తిగా నవాజుద్దీన్ కనిపిస్తున్నాడు. 20 వేల మంది పిల్లలని కిడ్నాప్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ సంస్థలకు హ్యాండోవర్ చేసే మాఫియా జరుగుతోంది. దీనిని ఆపాలి అనుకున్న తరుణంలో వెంకీ ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది.
ఆల్రెడీ డ్యూటీలో ఉండి కొన్ని కారణాల వల్ల అండర్ కవర్ లోకి వెళ్లిన పోలీసు తిరిగి వచ్చిన పాత్రలో వెంకీ కనిపిస్తున్నాడు. వెళ్లే ముందు చెప్పి వెళ్ళా. వినలేదు. అంటే భయం లేదు.. లెక్క మారుద్ది రా నా కొడకల్లారా అంటూ వెంకీ చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్ అదరహో అనిపిస్తోంది. మొత్తంగా సైంధవ్ చిత్రంపై టీజర్ అంచనాలు పెంచేసింది.