Bigg Boss Telugu 7: ఒక్క వారంలో ఎలిమినేట్ అయిన నయని పావని రెమ్యునరేషన్ ఎంతంటే?

Published : Oct 16, 2023, 12:13 PM IST
Bigg Boss Telugu 7: ఒక్క వారంలో ఎలిమినేట్ అయిన నయని పావని రెమ్యునరేషన్ ఎంతంటే?

సారాంశం

వరుసగా ఆరవ వారం కూడా అమ్మాయి ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఇంటిని వీడింది. ఆమె రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారంటే...   

బిగ్ బాస్ తెలుగు 7 రీ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన హోస్ట్ నాగార్జున ఐదుగురు కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపాడు. అంబటి అర్జున్, నయని పావని, అశ్వినిశ్రీ, పూజా మూర్తి, భోలే షావలి హౌస్లో అడుగుపెట్టారు. అనూహ్యంగా వీరిలో ఒక వికెట్ డౌన్ అయ్యింది. నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. అమర్ దీప్, ప్రిన్స్ యావర్,తేజా, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, శోభా శెట్టి నామినేట్ అయ్యారు. వీరు ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. 

చివరికి అశ్వినీ శ్రీ, నయని పావని పిలిచాడు. సీక్రెట్ రూమ్ కి ఇద్దరినీ పిలిచిన నాగార్జున నయని పావని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో నయని పావని షాక్ అయ్యింది. ఆమె ఒక్కసారిగా కూలిపోయింది. బాగా ఏడ్చేసింది. వేదిక మీద కూడా నయని పావని ఏడుస్తూనే ఉంది. కేవం ఒక వారంలో ఎలిమినేట్ అవుతానని ఆమె ఊహించి ఉండదు. వైల్డ్ కార్డు ఎంట్రీ కావడంతో ఒకటి రెండు వారాలు ఆమెకు ఛాన్స్ ఉంటుందని భావించి ఉండవచ్చు. 

ముఖ్యంగా శివాజీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. శివాజీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మా నాన్న కూడా అంతే. ప్రతి రోజూ ఉదయం హగ్ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అని చెప్పింది. శివాజీ వీలైతే తనను ఎలిమినేట్ చేసి నయని పావనిని సేవ్ చేయాలని కోరాడు. ఎవరు హౌస్లో ఉండాలి, వారు వెళ్ళిపోవాలి అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని నాగార్జున అన్నాడు. 

కాగా నయని పావని ఒక్క వారం మాత్రమే హౌస్లో ఉంది. ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసున్నారనే విషయంలో చర్చ జరుగుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నయని పావని వారానికి రూ. 2 లక్షల ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టిందట. ఆ లెక్కన ఆమెకు కేవలం రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ గా ముట్టాయి. ఇక నయని ఎలిమినేషన్ మీద ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఓట్ల ఆధారంగా కాకుండా ఎలిమినేట్ చేశారని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు... 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?