కార్తికేయ`రాజా విక్రమార్క` క్లోజింగ్ కలెక్షన్స్, లాస్ ఎంత?

By Surya PrakashFirst Published Nov 29, 2021, 12:46 PM IST
Highlights

 టీజ‌ర్, ట్రైల‌ర్‌ ఆసక్తిక‌రంగా ఉండ‌టంతో సినీప్రియుల్లో మంచి అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే ఆ అంచ‌నాల్ని అందుకోవ‌డంలో ఈ విక్ర‌మార్కుడు స‌ఫ‌ల‌ం కాలేదు.  సినిమా పరమ బోర్ అనే టాక్ మొదటి రోజు మార్నింగ్ షోకే వచ్చేసింది. ఈ నేపధ్యంలో  ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత, ఎంత నష్టం వచ్చిందనే విషయాలు చూద్దాం.

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా హీరోగానూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు కార్తికేయ‌. ఆ చిత్రం త‌ర్వాత కార్తికేయ నుంచి అర‌డ‌జ‌ను వ‌ర‌కు చిత్రాలొచ్చినా.. ఏదీ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు మాట వినిపించాల‌నే ల‌క్ష్యంతో ‘రాజా విక్ర‌మార్కుడు’లా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీస‌రిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఎన్ఐఏ క‌థాంశంతో రూపొందిన థ్రిల్ల‌ర్ సినిమా కావ‌డం.. దీనికి త‌గ్గ‌ట్లుగానే టీజ‌ర్, ట్రైల‌ర్‌ ఆసక్తిక‌రంగా ఉండ‌టంతో సినీప్రియుల్లో మంచి అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే ఆ అంచ‌నాల్ని అందుకోవ‌డంలో ఈ విక్ర‌మార్కుడు స‌ఫ‌ల‌ం కాలేదు.  సినిమా పరమ బోర్ అనే టాక్ మొదటి రోజు మార్నింగ్ షోకే వచ్చేసింది. ఈ నేపధ్యంలో  ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత, ఎంత నష్టం వచ్చిందనే విషయాలు చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. రాజా విక్రమార్క సినిమా 2 కోట్ల నష్టాలను మిగిల్చింది.  రాజా విక్రమార్క మూవీకి నెగటివ్ టాక్ రావడంతో.. సినిమానికి భారీ లాస్ వచ్చేసింది నిర్మాతలకు. రాజా విక్రమార్కని 4.3 కోట్లకు అమ్మెయ్యగా.. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ 2.33 కోట్లు షేర్ మాత్రమే షేర్ రావడంతో.. 2.17 కోట్ల నష్టాలూ చవిచూడాల్సి వచ్చింది. దానితో కార్తికేయ ఖాతాలో మరో డిజాస్టర్ పడినట్లయింది. వరస ప్లాప్స్ తో కార్తికేయ కి రాజా విక్రమార్క అయినా ఒడ్డున పడేస్తుంది  అనుకుంటే..ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.

ఏరియా - కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం - 0.57

సీడెడ్ - 0.31

ఉత్తరాంధ్ర - 0.36

ఈస్ట్ గోదావరి - 0.23

వెస్ట్ గోదావరి - 0.16

గుంటూరు - 0.16

కృష్ణా - 0.21

నెల్లూరు - 0.18

ఏపీ అండ్ తెలంగాణ - 2.11 కోట్లు షేర్

ఇతర ప్రాంతాలు అండ్ ఓవర్సీస్ - 0.22

వరల్డ్ వైడ్ ఫైనల్ కలెక్షన్స్ - 2.33 కోట్లు షేర్ 

click me!