
వెట్రిమారన్... సినిమా వస్తోందంటే చాలు.. ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతుంటాయి. స్టార్ల కంటే కూడా కథలకే పెద్దపీట వేస్తూ సినిమాలు తీయడం ఆయన స్టైల్. నేషనల్ అవార్డ్ లలో ఆయన పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఆయన తమిళంలో తీసిన అసురన్ తెలుగులో నారప్పగా రీమేక్ అయ్యింది. ఆయన ఇటీవల తమిళంలో తీసిన చిత్రం ‘విడుదలై: పార్ట్1. కామెడీ క్యారక్టర్స్ చేసే సూరి ఇందులో హీరో కావడంతో అందరిలోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది. అక్కడ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తెలుగులో ‘విడుదల: పార్ట్1’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ చిత్రానికి తెలుగునాట మంచి ఆదరణే దక్కిందని చెప్పాలి. తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ 1.2 కోట్లు వసూలు చేసింది. ఓ తమిళ డబ్బింగ్ చిత్రానికి ఇది మంచి స్టార్టింగ్ అని చెప్పాలి. ఈ రోజు కూడా చాలా చోట్ల ఆక్యుపెన్సీ బాగుందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే వీకెండ్ అయ్యాక కూడా ఇదే స్దాయిలో కలెక్షన్స్ నిలబడతాయా లేదా అనేది వేచి,చూడాల్సిన విషయం.
సూరి ఈ చిత్రంలో కానిస్టేబుల్ కుమరేశన్ గా నటించాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించినప్పటికీ, హీరో మాత్రం సూరినే. అన్యాయాన్ని ఆపలేక అతడు పడే సంఘర్షనను కూడా ట్రైలర్‌లో చూపించారు. పెరుమాళ్‌కు ఏం జరుగుతుంది, చివరకు ఎవరు పట్టుకుంటారు అనేది కథ. వెట్రిమారన్ రియలిస్టిక్ టేకింగ్, అరెస్టింగ్ స్కోర్ మరియు చివర్లో సూరి స్టంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. తెలుగులో కాంతార సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ. ఈ కంపెనీ ఇప్పుడు విడుదల పార్ట్-1ను రిలీజ్ చేయడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
సినిమా రైలు ప్రమాదంతో సినిమా ఆరంభమైనా.. దట్టమైన అడవుల్ని చూపించడం నుంచే దర్శకుడు విడుదల ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లాడు. బేస్ క్యాంప్ నుంచి కుమరేశన్ విధులు నిర్వర్తించే తీరు... ఆ క్రమంలో ఎదురయ్యే అనుభవాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అడవుల్లో జీవితాల్ని అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. (Viduthala telugu review) సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్నైతే ఆవిష్కరించారు.