ప్రముఖ క్లాసికల్ సింగర్ పంకజ్ ఉదాస్ ఫిబ్రవరి 26వ తేదీన తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలం అనారోగ్యంతో సతమతం అవుతున్న ఆయన ఈ రోజు కన్నుమూసినట్టు కుమార్తె నయాబ్ ఇన్‌స్టాలో ధ్రువీకరించారు.
Ghazal Singer: ప్రముఖ గజల్ గాయకుడు, క్లాసికల్ సింగర్ పంకజ్ ఉదాస్(73) తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ అనారోగ్యంతో తర్వాత ఆయన ఫిబ్రవరి 26వ తేదీన మరణించారు. ఈ విషయాన్ని పంకజ్ ఉదాస్ కుమార్తె నయాబ్ ఉదాస్ ధ్రువీకరించారు.
‘పద్మశ్రీ పంకజ్ ఉదాస్ 2024 ఫిబ్రవరి 26వ తేదీన తుది శ్వాస విడిచినట్టు భారమైన హృదయంతో, విచారంతో తెలియజేస్తున్నాం. దీర్ఘకాల అనారోగ్యంతో ఈ రోజు ఆయన కన్నమూశారు’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
Also Read: ‘ఇంతకుమించి ఏమీ పీకలేవు’.. రచ్చకెక్కుతున్న ఆంధ్రా టీమ్ క్రికెట్.. హనుమా విహారికి పృథ్వీరాజ్ కౌంటర్
భారత్‌లో సుపరిచతమైన గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ 1951 మే 17వ తేదీన జన్మించారు. ఆయన తన గజల్ ఆలాపనలతో ప్రసిద్ధి చెందారు. 1980, 90 దశకాల్లో ఆయన తన కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నారు. మన దేశంలోని ప్రముఖ గజల్ సింగర్‌లలో ఒకరిగా నిలిచారు. ఆయన శ్రావ్యమైన, మెలోడియస్ గళంతో ఉద్వేగభరిత గాన కచేరీలో చేశారు. ఆయన గాత్రానికి దేశ, విదేశాల నుంచి అభిమానులు ఉన్నారు.
చిట్టి ఆయిహై, ఔర్ అహిస్తా కీజియే బాతే, చాంది జైసా రంగ్ హై తేరా, న కజ్రే కి దార్ వంటి గజల్స్ పంకజ్ ఉదాస్ పాడిన వాటిల్లో పేరేన్నిక గలవి. మరికొందరు సంగీత కళాకారులతో కలిసి ఆయన పలు పాటల ఆల్బమ్‌లు విడుదల చేశారు. సంగీత పరిశ్రమలో చేసిన కృషికి గాను ప్రభుత్వం ఆయనకు 2006లో పద్మ శ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.