ఎన్టీఆర్ నటిస్తున్న `దేవర` మూవీ షూటింగ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయం లీక్ అయ్యింది. ఆయుధ పూజ వేరే లెవల్‌లో ఉంటుందట.
ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని భారీ స్కేల్లో రూపొందిస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు దసరాకి షిఫ్ట్ అయ్యింది. విజయ దశమి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.ఈ మూవీ ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ వరకు పూర్తయ్యిందట. టాకీ పార్ట్, పాటలు మిగిలి ఉన్నట్టు తెలుస్తుంది.
త్వరలో పాటలు ప్రారంభించనున్నారట. అందులో భాగంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై రొమాంటిక్ సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నారట. గోవా, కొచ్చిలలో ఈ పాటని చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు లొకేషన్ల అన్వేషణ కూడా చేస్తున్నారట. మార్చి మొదటి వారం నుంచి ఈ పాటల చిత్రీకరణ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇందులో ఆయుధ పూజ కాన్సెప్ట్ తో ఓ పాట ఉందట. అది సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు మొదట ఈ పాటనే చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఈ పాట గూస్‌బంమ్స్ తెప్పిస్తుందని అంటున్నారు.
ఆ తర్వాత మిగిలిన పాటలు షూట్ చేస్తారట. అనంతరం టాకీ పార్ట్ ఉంటుందని తెలుస్తుంది. టాకీ పార్ట్ ఈజీనే కానీ సాంగ్స్ కే టైమ్ పడుతుంది. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రని పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల జల్లికట్టు జాతర జరిగింది. అందులో ఎన్టీఆర్‌కి చెందిన దేవర మూవీ ఫ్లెక్సీలను ప్రదర్శించడం విశేషం. అంతేకాదు ప్లెక్సీలకు దెండలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ అయితే ఈ జాతర వేరే లెవల్‌లో ఉంటుందంటున్నారు. ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది.