Karthi : త్వరలో హీరో కార్తీక్ నెక్ట్స్ మూవీ అప్డేట్.. ఆ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడంటా కార్తీ..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 26, 2022, 06:53 PM IST
Karthi : త్వరలో  హీరో కార్తీక్ నెక్ట్స్ మూవీ అప్డేట్.. ఆ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడంటా కార్తీ..!

సారాంశం

కార్తీ  హీరోగా తన 24వ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ  సందర్భంగా మూవీకి సంబంధించిన అప్డేట్ ను త్వరలో అందించనున్నట్టు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.   


తమిళ హీరో కార్తీ సినిమాలంటే అటు  తమిళ ప్రేక్షకులతో పాటుు ఇటు తెలుుగు ప్రేక్షకులు కూడా ఎక్కువగానే ఆదరిస్తారు. హీరో సూర్య ద్వారా తమిళం, తెలుగు  ఇండ్రస్ర్టీ కి ఎంట్రీ ఇచ్చిన కార్తీ ెంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 

అయితే తెలుగులో ‘యుగాని ఒక్కడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు కార్తీ. ఆయన నటనకు చాలా మంది ఆడియెన్స్ అభిమానులుగా మారారు. ఆ తర్వాత ‘ఆవారా’ మూవీతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు కార్తీ. ఈ మూవీ యూత్ కు ఎక్కువ కనెక్ట్  అయ్యింది.   అప్పట్లో ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ ఒక్క ఊపూపాయి. మంచి మ్యూజిక్ ఉండటం, కార్తీక్ కు జంటగా తమన్న నటించడం యూత్ కు బాగా నచ్చింది. దీంతో యూత్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు కార్తీ. ఆ తర్వాత కొన్ని చిత్రాలతో వచ్చినా పెద్దగా ఆడలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘ఖాకీ’ ‘ఖైదీ’ మూవీతో తన క్రేజ్ ను పెంచుకున్నాడు. 

 

ప్రస్తుతం కార్తీ నటించిన మూవీ ‘ఖైదీ’ని  బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. కాగా, కార్తీ ప్రస్తుతం తెలుగు మూవీల కంటే తమిళ మూవీలపై ఎక్కువగా ఆసక్తిచూపుతున్నట్టు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ మూవీని కూడా తమిళంలోనే తీయనున్నారు. తమిళంలో వచ్చిన ‘బ్యాచిలర్’ మూవీ డైరెక్టర్ సతీష్ - సెల్వన్ కుమార్ తో తన నెక్ట్స్ మూవీని తీయనున్నట్టు కార్తీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. త్వరలో మూవీకి సంబంధించిన  అప్డేట్ కూడా రానున్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్తీ మళ్లీ యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తున్నారంటూ తెలుపుతున్నారు. మరోవైపు ఈ ఏడాది తమిళంలో కార్తీ నటిస్తున్న మూడు సినిమాలు చిత్రీకరణ పనులు జరుపుకుంటున్నాయి. కాగా మరో కొత్త కథతో తెలుగులో కార్తీ  చిత్రం వస్తే బాగుంటుందని, నెక్ట్స్ మూవీనైనా తెలుగు, తమిళం బైలింగ్వల్ లో తీస్తారని ఆశిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు