పాలిటిక్స్ లో వేణుమాధవ్ కామెడీ!

By Udayavani DhuliFirst Published Nov 23, 2018, 3:07 PM IST
Highlights

కమెడియన్ వేణుమాధవ్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆయన ఇప్పుడు వ్యవహరిస్తోన్న తీరు చూస్తుంటే రాజాకీయలతో అతడు కామెడీ చేస్తున్నట్లుగా ఉంది వ్యవహారం. 

కమెడియన్ వేణుమాధవ్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆయన ఇప్పుడు వ్యవహరిస్తోన్న తీరు చూస్తుంటే రాజాకీయలతో అతడు కామెడీ చేస్తున్నట్లుగా ఉంది వ్యవహారం. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన సమయంలో టీడీపీ పార్టీ ప్రచారంలో పాల్గొని జగన్ పై కామెంట్లు చేశాడు వేణుమాధవ్.

నంద్యాలలో ఉపఎన్నికలు వచ్చిన సమయంలో కూడా టీడీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు కోదాడ నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ టికెట్ ని ఆశించాడు. కానీ అది జరగలేదు. రెండో సారి కూడా అలానే జరగడంతో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేశాడు. 

అతడు వేసిన నామినేషన్ లో తప్పులు దొర్లడంతో ఎన్నికల కమీషన్ అతడి నామినేషన్ ని రిజక్ట్ చేసింది. తప్పులు సరి చేసుకొని తన మద్దతుదారులతో కలిసి మరోసారి నామినేషన్ వేశారు. ఎలెక్షన్ కమీషన్ అతడి నామినేషన్ ని యాక్సెప్ట్ చేసింది.

కానీ ఇప్పుడు తన నామినేషన్ ని వెనక్కి తీసుకోవడంతో వేణుమాధవ్ కి రాజకీయాలంటే కామెడీ  అయిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'మహాకూటమి' నాయకులు  వేణుమాధవ్ తో మంతనాలు జరిపారని ఆ కారణంగానే ఆయన నామినేషన్ వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ మాత్రం దానికి ఆయన నామినేషన్ వేయడం ఎందుకంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. 

మళ్లీ నామినేషన్ వేసిన వేణుమాధవ్!

వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి

click me!