`ఇండియన్‌ 2`లో విలన్ గా వెన్నెల కిషోర్‌.. ఫన్నీ వివరణ ఇచ్చిన కమెడియన్‌..

Published : Mar 01, 2023, 03:02 PM IST
`ఇండియన్‌ 2`లో విలన్ గా వెన్నెల కిషోర్‌.. ఫన్నీ వివరణ ఇచ్చిన కమెడియన్‌..

సారాంశం

లోక నాయకుడు హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో ప్రతీష్టాత్మక మూవీ `ఇండియన్‌ 2` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా వెన్నల కిషోర్‌ నటించబోతున్నారట. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

అనేక అడ్డంకుల కారణంగా ఆగిపోయిన `ఇండియన్‌2`ని పట్టాలెక్కించారు కమల్‌. `విక్రమ్‌` సినిమా సక్సెస్‌ ఇచ్చిన బూస్ట్ తో `ఇండియాన్2`ని పూర్తి చేసే పనిలో పడ్డారు. దర్శకుడు, నిర్మాణ సంస్థకి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి సినిమా షూటింగ్‌ ని స్టార్ట్ చేయించారు. శంకర్‌ ఓ వైపు రామ్‌చరణ్‌ తో `ఆర్‌సీ15` చేస్తున్నప్పటికీ ఆయన్ని ఒప్పించి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో కాజల్‌.. కమల్‌కి జోడీగా నటిస్తుండగా, సిద్ధార్థ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా రకుల్‌ కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌లో సాగుతుంది. రామ్‌ చరణ్‌ మూవీకి బ్రేక్‌ ఇచ్చి ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ పోర్షన్స్ కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శంకర్‌. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో తెలుగు స్టార్‌ కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం మరో అడుగు ముందుకేసి వెన్నెల కిషోర్‌ది ఇందులో నెగటివ్‌ రోల్‌ అని, విలన్‌గా నటిస్తున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే సన్నిహితుల ద్వారా ఈ న్యూస్‌ కమెడియన్‌కి చేరడంతో తాజాగా ఆయన స్పందించారు. 

వెన్నెల కిషోర్‌ సోషల్‌ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఫన్నీగా తన సమాధానం చెప్పడం విశేషం. ఆయన చెబుతూ, `ఇండియన్‌ 2`లో గానీ, పాకిస్థాన్‌ 3`లోగానీ లేను` అని తనదైన స్టయిల్‌లో ఫన్నీగా చెప్పడంతో ఆయన రియాక్షన్‌ కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. మరోవైపు `ఇండియన్‌ 2`లో వెన్నెల కిషోర్‌ అనే వార్తలకు చెక్‌ పెట్టినట్టయ్యింది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్‌ అత్యంత బిజీ యాక్టర్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. ఆయన స్టార్‌ హీరోల నుంచి, యంగ్‌ హీరోల వరకు, అప్‌కమింగ్‌ హీరోల సినిమాల్లోనూ, కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ చిత్రాలు, ఓటీటీ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌లు ఇలా ఒక్కటేమిటి అన్నింటిలోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో అత్యంత బిజీ యాక్టర్‌ వెన్నెల కిషోర్‌ కావడం విశేషం. ఒకప్పుడు బ్రహ్మానందం తరహాలో ఇప్పుడు తన రేంజ్‌లో వెన్నెల కిషోర్‌ హాస్య నటుడిగా తన హవా సాగిస్తున్నారు. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కమెడియన్‌గానూ రాణిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?