ఏజ్ బార్ అవుతున్నా.. యంగ్ హీరోస్ కంటే దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. డైరెక్టర్లు కూడా ఈ ఇద్దరి స్టార్లపైనే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టారు. ఇక ఈసారి చిరంజీవితో సినిమా కోసం బాలయ్య దర్శకుడు రెడీ అవుతున్నాడట.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గెలుపోటములు లెక్క చేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇదే క్రమంలో అటు బాలయ్య బాబు కూడా వరుస సినిమాలు పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు సక్సెస్ లతో ఫామ్ లోకి వచ్చారు. నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి బాలయ్య దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారట. ఆయన ఎవరో కాదు.. వీరసింహారెడ్డితో సూపర్ సక్సెస్ కొట్టిన గోపీచంద్ మలినేని.
మొదటి నుంచి గోపీచంద్ మలినేని తన సినిమాల్లో మాస్ యాక్షన్ ప్రధానంగా ఉండేట్టు చూసుకుంటున్నాడు. మాస్ డాన్సులు .. డైలాగులతో పాటు కామెడీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. డాన్ శీను' 'బలుపు,పండగ చేస్కో, క్రాక్ లాంటి సినిమాలతో సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య మాస్ మహారాజ్ వంటి సినిమాలు కనిపిస్తాయి. రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ .. బాలయ్యతో చేసిన వీరసింహా రెడ్డి సినిమాలు సంచలనం సృష్టించాయి. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ పై కన్నేశాడు. సినిమా పరంగా, కథ పరంగా, మ్యూజిక్ పరంగా.. ఏ రకంగా చూసుకున్నా.. వీరసింహారెడ్డి సినిమా.. సంక్రాంతి సూపర్ హిట్ గా మారింది.
undefined
ఇక ఈ నేపథ్యంలో గోపీచంద్ కు డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మలినేనితో సినిమా చేయడానికి సిగ్నల్స్ ఇస్తున్నట్టు సమాచారం. పెద్ద హీరోలు కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈక్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఏ హీరోతో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా మలినేని గోపీచంద్ మెగాస్టార్ చిరంజీవికి ఒక కథను వినిపించాడని సమాచారం. అంతే కాదు ఆ కథ మెగాస్టార్ కి బాగా నచ్చేసిందని అంటున్నారు. చిరంజీవికోసం ఇప్పటికే ఓ నలుగురు దర్శకులు సినిమా చేయాలని రెడీగా ఉన్నారు. కాని మెగాస్టార్ మాత్రం మలినేని గోపీచంద్ వైపే మొగ్గు చూపుతున్నారట.
ఇతర దర్శకులు కథలు కూడా ఒకే అయినా సరే.. ముందు గోపీచంద్ సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట చిరంజీవి. ఈక్రమంలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాలయ్యను డైరెక్ట్ చేసిన గోపీచంద్.. మెగాస్టార్ ను ఏరకంగా చూపిస్తాడో చూడాలి. అసలు దీన్లో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.