బోర్డర్ కు బయలుదేరుతున్న 'వెంకీ మామ'!

Published : May 11, 2019, 10:03 AM IST
బోర్డర్ కు బయలుదేరుతున్న 'వెంకీ మామ'!

సారాంశం

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు ఈ చిత్రాల్లో రీల్ లైఫ్ కూడా మామ అల్లుళ్ళుగా మారారు. జైలవకుశ ఫేమ్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు ఈ చిత్రాల్లో రీల్ లైఫ్ కూడా మామ అల్లుళ్ళుగా మారారు. జైలవకుశ ఫేమ్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆరంభంలో వెంకీ మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీనితో వెంకీ మామపై అంచనాలు పెరిగాయి. 

దర్శకుడు బాబీ ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య ఈ చిత్రంలో మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక వెంకటేష్ గోదావరి ఒడ్డున ఉండే పల్లెటూరిలో రైస్ మిల్ ఓనర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కి సిద్ధం అవుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ ని బాబీ కాశ్మీర్ బోర్డర్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యపై అక్కడ మిలటరీ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ఆసక్తికరంగా సాగే కథతో పాటు వినోదాత్మక అంశాలని కూడా బాబీ పుష్కలంగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ జోడిగా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్