ప్రభాస్ గెస్ట్ గా నటించిన చిత్రం టీజర్ ఇదిగో!

Published : May 11, 2019, 09:42 AM IST
ప్రభాస్ గెస్ట్ గా నటించిన చిత్రం టీజర్ ఇదిగో!

సారాంశం

కేవలం తెలుగుకే కాదు హిందీ మార్కెట్ కు సైతం ప్రభాస్ హాట్ ప్రాపర్టీ. అందుకే ఓ బాలీవుడ్ చిత్రం నిర్మాతలు ఆయన్ని తమ సినిమాలో గెస్ట్ గా తీసుకున్నారు. 

కేవలం తెలుగుకే కాదు హిందీ మార్కెట్ కు సైతం ప్రభాస్ హాట్ ప్రాపర్టీ. అందుకే ఓ బాలీవుడ్ చిత్రం నిర్మాతలు ఆయన్ని తమ సినిమాలో గెస్ట్ గా తీసుకున్నారు. ఆ చిత్రం తమిళ,తెలుగు, హిందీ లలో రిలీజ్ అవుతోంది.  

ప్రభుదేవా, తమన్నా, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖామోషీ’. ఈనాడు, చీకటి రాజ్యం చిత్రాల దర్శకుడు  చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని... పీవైఎక్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

యువన్‌ శంకర్‌ రాజా సంగీతం  అందిస్తున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ గెస్ట్ గా కనిపిస్తారు.  2017లోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను   విడుదల చేశారు. 

తమన్నా మూగ , చెవిటి యువతిగా కనిపించారు. ప్రభుదేవా  విలన్ గా తన హావభావాలతో దడ పుట్టించారు. ఆయన ఇందులో సైకో పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ‘జాగ్రత్తగా ఉండండి.. ఒక్కసారి అతడికి చిక్కితే.. వదిలిపెట్టడు’ అంటూ టీజర్‌లో చూపించారు. 

సమీర్‌ టాండన్‌, సత్య మానిక్‌ అఫ్సర్‌ సంగీతం అందిస్తున్నారు. సంజయ్‌ సూరి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Singeetam Srinivasa Rao ప్రపంచ రికార్డ్, ఇండియాలోనే ఫస్ట్ డైరెక్టర్‌.. హాలీవుడ్‌ లెజెండ్‌కి షాక్‌
Sr NTR: తాతమ్మ కల సినిమాకి భానుమతి కండిషన్.. ఎన్టీఆర్ కి దిమ్మతిరిగే షాక్..!