నికిషా పటేల్ కు హెల్త్ ఎలా ఉంది.. ఆ పోస్ట్ అర్దం ఏంటి?

Published : May 11, 2019, 09:25 AM IST
నికిషా పటేల్ కు హెల్త్ ఎలా ఉంది.. ఆ పోస్ట్ అర్దం ఏంటి?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన  "కొమరం పులి" లో హీరోయిన్ గా చేసిన నికీషా పటేల్ గుర్తుండే ఉండి ఉంటుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన  "కొమరం పులి" లో హీరోయిన్ గా చేసిన నికీషా పటేల్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ రాకపోవటంతో  కోలీవుడ్ బాటపట్టింది. తమిళంలో ఐదారు చిత్రాల్లో ఈ గుజరాతీ ముద్దుగుమ్మ నటించి, ప్రేక్షకులను ఆలరించింది. ప్రస్తుతం జీవీ ప్రకాష్‌ సరసన, ఎళిల్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది.

అయితే  రీసెంట్ గా  ముంబై  హాస్పటిల్ లో రహస్యంగా నికీషా పటేల్‌ ఆపరేషన్‌ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఆపరేషన్ ఎందుకు చేయించుకుంది, అనారోగ్యం ఏమిటి వంటి సమాచారం బయటకు రాలేదు.  అయితే మీడియాలో ఇందుకు సంభందించిన రూమర్స్ స్పెడ్ అవుతూండటంత ...  ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ నిజమే అని కన్ఫర్మ్ చేసారు. 

తనకు చిన్న ఆపరేషన్‌ జరిగిందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని, ఎలిల్‌ సినిమాలో తన షూటింగ్‌ పూర్తయ్యిందని, కొత్త ప్రాజెక్ట్‌ కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె స్మైల్స్ ఆఫ్ రికవరీ అంటూ పోస్ట్ పెట్టి, తన ఫొటో పెట్టింది.

రికవరీ మోడ్ లో ఉన్నానని, సిక్, అయినా స్టిల్ మాగ్జిమమ్ స్టెంత్ తో ఉన్నానని చెప్పుకొచ్చింది.  అయితే ఇది చదివినవారికి ఆమె పూర్తిగా రికవరీ అవ్వలేదని అర్దమవుతోంది.  అయితే అసలు ఆమెకు ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది మాత్రం ఇప్పటిదాకా తెలియరాలేదు. 

అందుతున్న సమాచారం మేరకు  కొద్ది నెలల క్రితం ఆమె హఠాత్తుగా పడిపోయిందని, వెంటనే హాస్పటిల్ కు తీసుకెల్లారని అక్కడ సర్జరీ చేసారని తెలుస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి