క్విక్ ప్రాజెక్టుగా.. ‘దృశ్యం 2’ రీమేక్, వెంకీ డెసిషన్

దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం 2 అనే చిత్రాన్ని  'జీతూ జోసఫ్ తెర‌కెక్కించ‌గా,  ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించారు.  కోవిడ్‌ నేపథ్యంలో  దృశ్యం 2  చిత్ర షూటింగ్‌ కొంత ఆల‌స్యంగా ప్రారంభం కాగా, ఈ మూవీ షూటింగ్‌ని కేవ‌లం 46 రోజుల‌లో పూర్తి చేశారు.  మీనా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఆశీర్వాద్ సినిమాస్ బేన‌ర్‌పై ఆంటోని పెరుంబ‌వూర్ నిర్మిస్తున్నారు.
 

Venkatesh to take up Drishyam 2? jsp

మోహన్ లాల్ నటించిన మలయాళ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఒక సంచలనాత్మక హిట్, ఇది తెలుగుతో సహా అనేక భాషల్లో రీమేక్‌ అయ్యింది. తెలుగు వెర్షన్‌లో మోహన్‌లాల్ పాత్రను వెంకటేష్ తిరిగి పోషించాడు, అది కూడా విజయవంతమైంది. కుటుంబ విలువ‌లు, మర్డర్‌ మిస్టరీ అంశాల క‌ల‌బోత‌గా రూపొందిన చిత్రం అందరినీ మెప్పించింది. ప్రస్తుతం దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం-2’ను జీతూ జోసెఫ్‌ తెరక్కించారు. ఇప్పుడు, అదే తారాగణం మరియు దర్శకుడితో ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్ పూర్తయింది.

 మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ ఈ వీకెండ్ లో అంటే 19 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపధ్యంలో తెలుగులో ఈ సినిమాని వెంకటేష్ రీమేక్ చేస్తారా చేయరా అనే టాపిక్ హాట్ గా మారింది.  అమెజాన్ లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతున్న సినిమాని వెంకటేష్ ఎందుకు మళ్లీ రీమేక్ చేస్తాడని కొందరు అంటున్నారు. అయితే ఓటీటి గొడవ ఓటీటిదే..థియోటర్ కువచ్చే చూసేవాళ్ళు అక్కడే చూస్తారు. అయినా ఒరిజనల్ మళయాళంలో ఉంటుంది కదా,సినిమావాళ్లు తప్ప సామాన్యులు చూడరు  అని వెంకీ భావిస్తున్నారట.

Latest Videos

అయితే అందుతున్న సమాచారం మేరకు.. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో కూడా రీమేక్ కావడానికి ప్లానింగ్ అయితే ఉంది. సీక్వెల్ కోసం ప్రపోజల్ ను వెంకటేష్ అందుకున్నాడు. ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి రెండు,మూడు  రోజుల్లో దర్శక,నిర్మాతలతో మాట్లాడనున్నాడు. మే నెలలో తెరపైకి రానున్న ‘నారప్ప’ షూటింగ్ ను వెంకటేష్ ఇటీవల పూర్తి చేసారు. అలాగే ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ షూటింగ్‌లో ఉన్నారు.
 
ఈ ‘దృశ్యం 2’ ను ఎక్కువ సమయం తీసుకోకుండా ఓ క్విక్ ప్రాజెక్టుగా..మూడు నెలల్లో పూర్తి చేయాలని వెంకీ భావిస్తున్నట్లు సిని వర్గాలు చెబుతున్నాయి. ఇక దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం 2 అనే చిత్రాన్ని  'జీతూ జోసఫ్ తెర‌కెక్కించ‌గా,  ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించారు.  కోవిడ్‌ నేపథ్యంలో  దృశ్యం 2  చిత్ర షూటింగ్‌ కొంత ఆల‌స్యంగా ప్రారంభం కాగా, ఈ మూవీ షూటింగ్‌ని కేవ‌లం 46 రోజుల‌లో పూర్తి చేశారు.  మీనా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఆశీర్వాద్ సినిమాస్ బేన‌ర్‌పై ఆంటోని పెరుంబ‌వూర్ నిర్మిస్తున్నారు.

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image