Latest Videos

యంగ్ హీరోయిన్ తో వెంకీ మామ రొమాన్స్... అనిల్ రావిపూడి ఆమెను సెట్ చేశాడా? 

By Sambi ReddyFirst Published Jun 21, 2024, 4:44 PM IST
Highlights

వెంకీ మామ తన నెక్స్ట్ మూవీలో యంగ్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నాడని టాక్. ఈ మేరకు ఆసక్తికర వార్త హల్చల్ చేస్తుంది. 
 

వెంకటేష్ సోలోగా భారీ హిట్ కొట్టాలని చూసి దెబ్భై పోయాడు. ఆయన నటించిన సంక్రాంతి చిత్రం సైంధవ్ డిజాస్టర్ అయ్యింది. వెంకటేష్ 75వ చిత్రం కావడంతో భారీ ఎత్తున తెరకెక్కించాడు. హిట్, హిట్ 2 చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శైలేష్ కొలను సైంధవ్ దర్శకుడు. మూవీ ఫలితం వెంకటేష్ ని నిరాశపరిచింది. దీంతో కలిసొచ్చిన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. 

గత దశాబ్ద కాలంలో ఎఫ్ 2 వెంకీ కెరీర్లో భారీ హిట్ గా ఉంది. వరుణ్-వెంకీ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఎఫ్ 2 కి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ 3 సైతం పర్లేదు అనిపించుకుంది. భగవంత్ కేసరి చిత్రంతో అనిల్ రావిపూడి మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. స్టార్స్ ఎవరూ ఖాళీగా లేకపోవడంతో వెంకీతో ఓ మూవీ కమిట్ అయ్యాడు. కేవలం నాలుగు నెలల్లో ఈ చిత్రం పూర్తి చేయనున్నాడట. 

ఇక వెంకీ-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' టైటిల్ నిర్ణయించారు. కాగా ఈ మూవీలో మొదట మీనాక్షి చౌదరి హీరోయిన్ అనుకున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ పేరు తెరపైకి వచ్చింది. లుక్ టెస్ట్ కూడా చేసిన టీమ్ ఐశ్యర్య రాజేష్ ని కన్ఫర్మ్ చేశారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందట. 
 

click me!