
ఒకప్పడు మన స్టార్స్ ను బాలీవుడ్ వాళ్లు పెద్దగా లెక్క చేసేవాళ్లు కాదు. వాళ్ళను మాత్రం మన వాళ్లు బ్రతిమలాడి మరీ.. మన సినిమాల్లోకి తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. మన తెలుగు స్టార్స్ ను కూడా బాలీవుడ్ వాళ్లు తమ సినిమాల్లో భాగస్వాములను చేసుకుంటున్నారు. నాగార్జున బ్రహ్మస్త్రా నినిమాలో నటిస్తుంటే.. విక్టరీ వెంకటేష్ ను సల్మాన్ ఖాన్ తన సినిమా కోసం తీసుకున్నారు.
టాలీవుడ్ హీరో వెంకటేశ్ చాలా ఏండ్ల తర్వాత బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫర్హద్ సామ్‌జీ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కభి ఈద్ కభి దివాళి. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాజిద్ నదియావాలా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టులో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. తాజా అప్ డేట్ ప్రకారం వెంకటేశ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారట. దాని కోసం డేట్స్ కూడా ఫిక్స్ చేశారట. జూన్ చివరి వారంలో ఈ సినిమా సెట్స్ లో ఆయన జాయిన్ కాబోతున్నాడట. అంతేకాదు వెంకీ ఫన్నీ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.
సల్మాన్ ఖాన్ , వెంకటేష్ క్రేజీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినిమా ప్రేమికులు. ఇక ఈమూవీ షూటింగ్ మే 11న ముంబైలో వేసిన స్పెషల్ సెట్‌లో స్టార్ట్ అయ్యింది. కెరీర్ ప్రారంభం నుంచి సల్మాన్ ఖాన్, వెంకటేశ్‌ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసే వెంకటేష్.. ఆమధ్య సల్మాన్ ఖాన్ హిందీలో నటించిన బాడీగార్డ్ మూవీని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు వెంకటేష్.
కరోనా గ్యాప్ తరువాత బాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలతో విజృంబిస్తున్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇలా స్టార్స్ అంతా వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రెజర్ పెరిగిపోవడంతో బాలీవుడ్ హీరోలు అయోయయంలో పడ్డారు. ఇక సల్మాన్ ఖాన్ మరోవైపు కత్రినాకైఫ్‌తో కలిసి టైగర్ 3ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.