
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. పూరితో లైగర్ మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ చిత్రం విడుదల కాకుండానే మరో కొత్త ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు. నిన్ను కోరి, మజిలి చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన శివ నిర్వాణ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ నుండి విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ అప్డేట్ కి సంబంధించి ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ప్రముఖ స్టంట్ మాన్ పీటర్ హేన్స్ ఈ ఫస్ట్ లుక్ సన్నివేశం రూపొందించడం విశేషం.
డైరెక్టర్ శివ నిర్వాణ విజయ్ ఫస్ట్ లుక్, ఎంట్రీ సీక్వెన్స్ రొమాంటిక్, హార్ట్ టచింగ్ ఉండాలని ఆయన చెబుతుంటే పీటర్ జాగ్రత్తగా వింటున్నారు. మరి పీటర్ హేన్స్ రూపొందించిన విజయ్ దేవరకొండ ఇంట్రో ఎలా ఉంటుందో రేపు తెలిసిపోనుంది. మే 16 ఉదయం 9:30 గంటలకు విడుదల కానుంది. విజయ్ కి జంటగా సమంత (Samantha) నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో విజయ్-సమంత మహానటి మూవీలో కలిసి నటించారు. కాంబినేషన్ రీత్యా ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొని ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ తో మూవీ ఓకే చేసిన విషయం తెలిసిందే. శివ నిర్వాణ చిత్రానికి ముందే సుకుమార్ ప్రాజెక్ట్ ప్రకటన జరిగింది. అయితే పుష్ప సీక్వెల్ లో బిజీగా ఉన్న సుకుమార్ ఫ్రీ కావడానికి మరో ఏడాదికి పైగా సమయం పడుతుంది. ఈ లోపు విజయ్ దేవరకొండ శివ నిర్వాణ మూవీ పూర్తి చేయనున్నారు.
ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ (Liger)ఆగష్టు 25న విడుదల కానుంది. విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపిస్తుండగా... పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. లైగర్ మూవీలో విజయ్ కి జంటగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.