కరోనా ఎఫెక్ట్ః వెంకీ `దృశ్యం 2` ఓటీటీలో..?

Published : Apr 18, 2021, 04:12 PM IST
కరోనా ఎఫెక్ట్ః వెంకీ `దృశ్యం 2` ఓటీటీలో..?

సారాంశం

ఏప్రిల్‌లో నెలలో మూడు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. మేలో విడుదల కావాల్సిన చిత్రాలు కూడా పోస్ట్ పోన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంకీ, సోదరుడు సురేష్‌బాబు ముందుగానే జాగ్రత్త పడుతున్నారట. `దృశ్యం 2`ని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. 

కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై తీవ్రంగా చూపిస్తుంది. థియేటర్‌కి వచ్చే ఆడియెన్స్ బాగా తగ్గిపోయారు. వైరస్‌ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సినిమాలు రిలీజ్‌లు కూడా వాయిదా వేసుకుంటున్నారు మేకర్స్. ఏప్రిల్‌లో నెలలో మూడు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. మేలో విడుదల కావాల్సిన చిత్రాలు కూడా పోస్ట్ పోన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంకీ, సోదరుడు సురేష్‌బాబు ముందుగానే జాగ్రత్త పడుతున్నారట. `దృశ్యం 2`ని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. 

వెంకటేష్‌ హీరోగా మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం `దృశ్యం2`కి రీమేక్‌గా తెలుగు `దృశ్యం 2` రూపొందుతుంది. మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ రూపొందిస్తున్నారు. సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. మీనా ఇందులో ఫీమేల్‌ లీడ్‌ చేస్తుంది. గతంలో వచ్చిన హిట్‌ చిత్రం `దృశ్యం`కిది సీక్వెల్‌ అన్న విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై బంపర్‌ హిట్‌ టాక్‌ని అందుకుంది. భారీ వ్యూస్‌ని పొందింది. దీంతో కరోనా ప్రభావంతో తెలుగులోనూ ఈ సినిమాని ఓటీటీలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి వెంకీ తన షూటింగ్‌ పార్ట్ ని పూర్తి చేసుకున్నారు. వారం పది రోజుల్లో షూటింగ్‌ మొత్తం పూర్తి కాబోతుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఇప్పుడు సినిమాలన్నీ వాయిదా పడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ వాయిదాల ఎఫెక్ట్ ఉంటుంది. వరుసగా పెద్ద సినిమాలు పోటీపడాల్సి వస్తుంది. థియేటర్ల సమస్య, ఆడియెన్స్ థియేటర్‌కి రావడం ఇలాంటి వన్నీ సమస్యలుగా మారుతాయి. దీంతో ఓటీటీలోనే ఈ సినిమాని విడుదల చేయడం బెటర్‌ అని నిర్మాత సురేష్‌బాబు భావిస్తున్నారట. 

వెంకీ నటించిన  మూడు సినిమాలు ఈ ఏడాది రాబోతున్నాయి. `నారప్ప` చిత్రం మే 14న విడుదల కావాల్సి ఉంది. ఇది రిలీజ్‌ అవుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ తర్వాత వెంకీ `ఎఫ్‌3`లో నటిస్తున్నారు. అది ఆగస్ట్ లో థియేటర్‌లో రిలీజ్‌ కాబోతుంది. ఈ రెండు సినిమాలతోపాటు ఇప్పుడు `దృశ్యం2` కూడా రెడీ కావడంతో,  దీన్ని ఓటీటీలోనే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. అందుకోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 30కోట్ల ఆఫర్‌ చేసినట్టు టాక్‌. ఇది ఓటీటీకి బిగ్‌ ఆఫర్‌ అనే చెప్పాలి. మొత్తానికి అన్నీ కుదిరితో `దృశ్యం2`ని త్వరలోనే ఓటీటీలో చూడొచ్చని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌