ప్రభాస్ ‘సాహో’ విలన్ కు కరోనా

Surya Prakash   | Asianet News
Published : Apr 18, 2021, 03:50 PM IST
ప్రభాస్ ‘సాహో’ విలన్ కు కరోనా

సారాంశం

ప్రభాస్‌ `సాహో` విలన్‌, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ సైతం కరోనాకు గురయ్యారు. ఆయనకు తాజాగా కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

కరోనాకు వారూ వీరు అని లేదు.  సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు.  కరోనా ఇప్పుడు దేశవ్యాప్తంగా రెండోసారి మరింత ఉధృతంగా విరుచుకు పడుతోంది. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ వరుసలో కరోనా కోరల్లో చిక్కుకున్న సినీ నటుల సంఖ్యా మామూలుగా లేదు. ఇప్పటికే చాలా మంది నటులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనాకు చిక్కారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. మరెందరో కరోనా కోరలకు చిక్కారు. షూటింగ్ లు బంద్ అయ్యాయి. థియోటర్స్ ఖాళీ అవుతున్నాయి.

ఇక బాలీవుడ్ లోనూ కరోనా బారిన పడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. తాజాగా విలన్ వేషాలు వేస్తున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ సైతం కరోనాకు చిక్కారు. ఈ మేరకు ఆయన ఈ విషయం తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన తల్లి తప్ప అందరు టెస్ట్ లు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని తెలియచేసారు. ప్రస్తుతానికి తమకు సింప్టమ్స్ మైల్డ్ గానే ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ మహమ్మారి అంతమవుతుందని, ఈ లోగా అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

ఇక నీల్ నితిన్ ముఖేష్ ..విజయ్‌ హీరోగా చేసిన ‘కత్తి’లో విలన్‌ వేషం ఆఫర్‌ చేశాడు. అది పెద్ద హిట్‌ అయ్యింది. ‘ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో’, ‘గోల్‌మాల్‌ అగైన్‌’ వీటిలో వేసిన పాత్రలు, ఆ సినిమాలు హిట్‌ అయ్యాయి. ‘ఇందు సర్కార్‌’లో ‘సంజయ్‌గాంధీ’లా కనిపించి ఆకట్టుకున్నాడు నీల్‌. తెలుగులో ‘కవచం’, ‘సాహో’ సినిమాలు ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గర చేశాయి. నీల్‌ పెళ్లి చేసుకున్నాడు. రుక్మిణి సహాయ్‌ అతని భార్య పేరు. ఉమ్మడి కుటుంబంలో ఉండటానికే ఇష్టపడతాడు. శారీరక దారుఢ్యం మీద చాలా శ్రద్ధ పెడుతూంటారు ఆయన. 

PREV
click me!

Recommended Stories

Kritika Kamra Wedding: హీరోయిన్ తో స్పోర్ట్స్ యాంకర్ పెళ్లి.. సినీ తారలు, క్రికెటర్ల సందడి చూశారా
Hansika Divorce: విడాకులు మంజూరు చేసిన కోర్టు, సంచలన నిర్ణయం తీసుకున్న హన్సిక.. ఎవ్వరూ ఊహించలేరు