రామ్‌చరణ్‌ ఇంట్లో సల్మాన్‌ ఖాన్‌, వెంకటేష్‌, పూజా హెగ్డే సందడి.. సర్‌ప్రైజ్ అదిరింది..

Published : Jun 26, 2022, 09:17 PM IST
రామ్‌చరణ్‌ ఇంట్లో సల్మాన్‌ ఖాన్‌, వెంకటేష్‌, పూజా హెగ్డే సందడి.. సర్‌ప్రైజ్ అదిరింది..

సారాంశం

రామ్‌చరణ్‌ ఇంట్లో సల్మాన్‌ ఖాన్‌, వెంకటేష్‌, పూజా హెగ్డే సందడి చేయడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులను, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, విక్టరీ వెంకటేష్‌, పూజా హెగ్డే అభిమానులకు కనువిందు చేసే ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. రామ్‌చరణ్‌ ఇంటికి సల్లూ బాయ్‌, వెంకీ, పూజా విజిట్‌ చేయడం ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన సల్మాన్‌, వెంకీ, పూజాలను లంచ్‌కి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. దీంతో కాసేపు వీరంతా సరదాగా గడిపారు. 

అయితే వీరంతా కలవడానికి మరో కారణం ఉంది. సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం `కభీ ఈద్‌ కబీ దివాళీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో సల్మాన్‌,వెంకీ,పూజా పాల్గొంటున్నారు. అయితే రామ్‌చరణ్‌సైతం గెస్ట్ రోల్‌ చేస్తున్నారట. ఓ పాటలో చరణ్‌ మెరవబోతున్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య ఈ వార్త వైరల్‌ అయ్యింది. తాజాగా వీరి కలయికతో ఆ రూమర్స్ కి చెక్‌ పడింది. అందులో భాగంగానే ఈ గెట్‌ టుగేదర్‌ చోటు చేసుకుందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం విడుదలైన ఫోటో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. అభిమానులకు కళ్ల సంబురాన్నిస్తుంది. 

సల్మాన్‌, చరణ్‌ మంచి స్నేహితులు, వీరి మధ్య మంచి రిలేషన్‌ ఉంది. వెంకీ, సల్మాన్‌ కూడా స్నేహితులనే విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో వీరు కలుసుకున్నారు.ఆ ఫ్రెండ్స్ షిప్‌తోనే సల్మాన్‌ సినిమాలో వెంకీ నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సల్మాన్‌ సౌత్‌లో పాగా వేయాలని భావిస్తున్నారు. ఇటీవల తెలుగు సినిమాలు నార్త్ లో బాగా ఆడుతుండటం, పైగా తెలుగు సినిమా మార్కెట్‌ పెరగడంతో అందరి చూపు టాలీవుడ్‌పై పడింది. అందులో భాగంగా సల్మాన్‌ తన `కబీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకే తెలుగు స్టార్లని తన సినిమాలో నటింప చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సల్మాన్‌ చిరంజీవి నటిస్తున్న `గాడ్‌ ఫాదర్‌`లో కీలక పాత్ర చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ