గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తెలుగు షార్ట్ ఫిల్మ్.. రష్మిక మందన్నా ట్వీట్‌ వైరల్‌

Published : Jun 26, 2022, 07:11 PM IST
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్  రికార్డ్స్ లో తెలుగు షార్ట్ ఫిల్మ్.. రష్మిక మందన్నా ట్వీట్‌ వైరల్‌

సారాంశం

అత్యధిక అవార్డులు పొందిన లఘు చిత్రంగా `మనసానమః` వరల్డ్ రికార్డ్ సృష్టించి, గిన్నిస్‌ రికార్డ్ లో స్థానం సంపాదించింది.

తెలుగు షార్ట్ ఫిల్మ్ `మనసానమః` అరుదైన ఘనతని సాధించింది. సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గిన్నిస్‌ రికార్డుని సొంతం చేసుకుంది. అత్యధిక అవార్డులు పొందిన లఘు చిత్రంగా `మనసానమః` వరల్డ్ రికార్డ్ సృష్టించి, గిన్నిస్‌ రికార్డ్ లో స్థానం సంపాదించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్‌ క్వాలిఫైకు వెళ్లిన ఈ లఘు చిత్రం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై ఆశ్చర్యపరిచింది. 

తాజాగా `మనసానమః` జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గిన్నీస్ రికార్డ్స్ లో ఎక్కిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇది గిన్నీస్‌ లెక్కల ప్రకారం 513 అవార్డులను దక్కించుకోగా, ఇతర అన్ని అవార్డులు కలుపుకుని 900లకుపైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది. తాజాగా గిన్నీస్ బుక్ లోనూ చోటు దక్కించుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం.

విరాజ్‌ అశ్విన్‌ హీరోగా నటించిన `మనసానమః`లో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా `మనసానమహః` షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం అనేక జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.

ఇదిలా ఉంటే ఈ లఘు చిత్రం గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్న సందర్భంగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న అభినందనలు తెలిపింది. గతంలో ఆమె ఈ షార్ట్ ఫిల్మ్ చూసి అప్రిషియేట్‌ చేయగా, మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దీపిక్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. దీనికి రష్మిక స్పందించింది. చాలా గర్వంగా ఉందని, అభినందనలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది