హీరో వెంకటేష్ కూతురు లవ్ మ్యారేజ్!

Published : Sep 22, 2018, 11:41 AM ISTUpdated : Sep 22, 2018, 11:48 AM IST
హీరో వెంకటేష్ కూతురు లవ్ మ్యారేజ్!

సారాంశం

సీనియర్ హీరో వెంకటేష్ కూతురు అశ్రిత ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. చాలా కాలంగా అశ్రిత ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామి రెడ్డి కుమారుడే అతడు.

సీనియర్ హీరో వెంకటేష్ కూతురు అశ్రిత ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. చాలా కాలంగా అశ్రిత ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామి రెడ్డి కుమారుడే అతడు. అయితే ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇరు కుటుంబాలు ఇప్పుడు పెళ్లి చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

ఇప్పటికే సురేష్ బాబు.. రఘురామి రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ 'ఎఫ్2' సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ కి వచ్చిన తరువాత ఎంగేజ్మెంట్ తంతు పూర్తి చేసేసి పెళ్లి కానిచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అశ్రిత హైదరాబాద్ లో పేరున్న ప్రొఫెషనల్ బేకర్. ఇంట్లో తయారు చేసే బిస్కెట్లతో ఆమె ఇప్పటికే హైదరాబాద్ లో పలు స్టాల్స్ ని ఏర్పాటు చేసింది. ఫుడ్ బిజినెస్ లో కూడా దగ్గుబాటి వారి హవా చాటుతోంది అశ్రిత! 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం