Venkatesh New Movie: జాతిరత్నాలు డైరెక్టర్ తో వెంకటేష్ సినిమా, డోస్ పెంచబోతున్న వెంకీ

Published : Mar 19, 2022, 01:31 PM IST
Venkatesh New Movie: జాతిరత్నాలు డైరెక్టర్ తో వెంకటేష్ సినిమా, డోస్ పెంచబోతున్న వెంకీ

సారాంశం

ఆలోచించి మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటున్నాడు విక్టరీ స్టార్ వెంకటేష్. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వెంకీ.. వరుసగా  ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 

ప్రస్తుతం వెంకటేశ్ ఎఫ్ 3 మూవీ బిజీలో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మోర్ ఫన్.. మెర్ ఫ్రస్టేషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది మూవీ. అంతే కాదు ఎక్కువ మనీ సంపాదించమని భర్తలను భార్యలు టార్చర్ చేస్తే ఏం జరుగుతుందనేదే కథతో ఈసినిమా తెరకెక్కుతోంది.  

ఇక ఈ సినిమా తరువాత వెంకీ ఒప్పుకున్న సినిమాలు ఏమీ కనిపించడం లేదు. రానాతో మాత్రం రానా నాయుడు వెబ్ సిరీస్ చేస్తున్నాడు వెంకీ. మరో వైపు మరికొన్ని సినిముల ప్రపోజల్స్ స్థాయిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ మూవీని ఆయన ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ పేరు వినిపిస్తోంది. కొంతకాలం క్రితం ఆయన వెంకటేశ్ కి కథ వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి.అయితే  ఆ కథకి వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  

ప్రస్తుతం అనుదీప్ .. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఈ మూవీ షూట్ కంప్లీట్ అవ్వగానే  వెంకీతో కలిసి సెట్స్ పైకి వెళతాడని తెలుస్తోంది. అంతే కాదు సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా సమాచారం త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

జూనియర్ ఎన్టీఆర్ కు ఇరిటేషన్ తెప్పించి, బీపీ పెరిగిపోయేలా చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా? తారక్ ఏం చేశాడంటే?
Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్