
మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ RRR కోసం ప్రపంచ వ్యాపంగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ పిరియడ్ యాక్షన్ డ్రామాను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా మొత్తం ఈ చిత్రం కోసం వేచి చూస్తుంది. ఇద్దరు ఫ్రీడమ్స్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ లైఫ్ బేస్డ్ గా రూపొందించిన సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) వంటి బిగ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఆ హైప్ మరింత పెరిగింది. మరోవైపు ఈ చిత్రంలోని సన్నివేశాలు.. బ్రిటీష్ కాలం నాటి లోకేషన్లను చూపించడంలో జక్కన్న ఏమాత్రం తగ్గలేదు.
ఇప్పటికే, ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన దోస్తీ, నాటు నాటు, ఎత్తర జెండా వంటి సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అన్నిటికంటే ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఈ సాంగ్ ను ఉక్రెయిన్ (Ukraine)లో షూట్ చేశారు. దాదాపు రెండు వారాల పాటు ఆర్ఆర్ఆర్ టీం అక్కడి సెట్ లోనే పనిచేసింది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ స్టార్ లో ఒకరైన రామ్ చరణ్ కు సెక్యూరిటీగా రూస్టీ (Roosty) అనే వ్యక్తి పనిచేశాడు. ప్రస్తుతం రష్యా - ఉక్రెయిన్ వార్ మూలంగా అక్కడి పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్న విషయం తెలిందే. ఉక్రెయిన్ కు పలు దేశాల మద్దతు తోపాటు సాయం కూడా అందుతోంది. అయినా రష్యా బాంబు దాడులతో ఆ దేశ ప్రజలు ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. ఈ సందర్భంగా రూస్టీ కూడా తన దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
ఈ విషయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన రూస్టీ కుటుంబానికి డబ్బులు, అత్యవసర ఏర్పాట్లు చేశారు. సరుకులు కూడా కొనుగోలు చేసి ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు కూడా చరణ్ మనస్థత్వానికి మెచ్చుకుంటున్నారు. చరణ్ సాయం అందించినందుకు రూస్టీ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రంలో కొమురంభీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరిగా చరణ్ కనిపించబోతున్నారు. అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివీయో మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది భాషల్లో విడుదల కాబోతుంది.