'కేరాఫ్‌ కంచరపాలెం' డైరక్టర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్

Published : Aug 23, 2020, 07:02 AM IST
'కేరాఫ్‌ కంచరపాలెం' డైరక్టర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్

సారాంశం

దర్శకుడు వెంకటేష్‌ మహా.... ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో ప్రేమనే ఇతివృత్తంగా, మూడు దశల్లో ప్రేమకథలను చూపించారు. ఆ తర్వాత తన కొత్త సినిమాను ప్రతీకార ఛాయలున్న కథతో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ అంటూ రూపొందించారు.

'కేరాఫ్‌ కంచరపాలెం' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే  మంచి సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు వెంకటేష్‌ మహా.  ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో ప్రేమనే ఇతివృత్తంగా, మూడు దశల్లో ప్రేమకథలను చూపించారు. ఆ తర్వాత తన కొత్త సినిమాను ప్రతీకార ఛాయలున్న కథతో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ అంటూ రూపొందించారు.

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌ గా వచ్చిన ఈ చిత్రం సైతం మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆయన తన మూడో చిత్రానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు సు మతి అనే టైటిల్ పెట్టి, ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు.

ఈ సినిమా షూటింగ్ అంతా అమెరికాలో జరుగుతుంది. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ 'The Empire State of Mind'. ఓ పల్లెటూరి అమ్మాయి...అమెరికాలోని న్యూయార్క్ వెళ్లినప్పుడు జరిగే సంఘనటలతో చుట్టూ ఈ కథ తిరగనుంది. అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ని ఓ అమ్మాయి చూస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని గుర్తు చేస్తోంది.  ఇక ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన విజయ ప్రవీణ పరుచూరి ... అమెరికాలోనే ఉంటారు. 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?