నిలకడగా ఎస్పీబీ ఆరోగ్యం.. ఇంకా వెంటిలేటర్‌పైనే: ఎంజీఎం వర్గాలు

By Siva KodatiFirst Published Aug 22, 2020, 7:57 PM IST
Highlights

కరోనా బారినపడి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి

కరోనా బారినపడి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఆయన ఇంకా వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో ఐసీయూలోనే ఉన్నారని హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూకి తరలించిన సంగతి తెలిసిందే.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎంజీఎం వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో ఇంటర్నల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఇన్ఫెక్టివ్ డీసీజెస్, ఎక్మో కేర్ విభాగాల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారు.

వీరంతా అంతర్జాతీయ స్థాయి డాక్టర్లతో నిరంతరం అనుసంధానమై ఉంటున్నారని.. యూకే, యూఎస్‌లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సాయంతో అక్కడి వైద్యులు చికిత్స చేశారని ఎంజీఎం తెలిపింది.

ఎస్పీబీ ఆరోగ్యం మెరుగుపడటానికి తాము తీసుకుంటున్న చర్యలపై వారు సంతోషం వ్యక్తం చేశారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆయన కోలుకోవాలంటూ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు సైతం జరుగుతున్నాయి.

click me!