వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు

Published : Feb 11, 2017, 08:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు

సారాంశం

రిలీజ్ కు రెడీగా ఉన్న విక్టరీ వెంంకటేష్ గురు మూవీ ఇప్పటికే రిలీజై క్రేజీగా మారిన గురు టీజర్ సాంగ్ వేసవి కానుకగా గురు చిత్రం విడుదల చేసేందుకు నిర్ణయం

తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు . సుధా కొంగర దర్శకత్వం వహించిన "గురు" చిత్రం లో బాక్సింగ్ కోచ్ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపిస్తారు. 

 

స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉండే ఈ స్పోర్ట్స్ డ్రామా ను వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. ఈ చిత్రం లో ని  "ఏయ్ సక్కనోడా " పాట లిరికల్ వీడియో ను ఈ నెల 17 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత శశికాంత్ తెలిపారు. 

 

" సుప్రసిద్ధ దర్శకులు మణి రత్నం తో పని చేసి, మిత్ర్  సినిమా తో నేషనల్ అవార్డు  దక్కించుకున్న సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం. విక్టరీ వెంకటేష్ ను ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త లుక్ లో ప్రెసెంట్ చేస్తున్నాం. మంచి ఎమోషన్స్ తో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ వేసవి లో విడుదల చేస్తున్నాం. విడుదల తేదీ త్వరలోనే తెలుపుతాం" అని నిర్మాత శశికాంత్ తెలిపారు. 

 

రితిక సింగ్, ముంతాజ్ సర్కార్ లు ఈ చిత్రం లో వెంకటేష్ తో పాటు ప్రధాన పాత్రలను పోషిస్తారు. రితిక సింగ్ ఇటీవలే ఉత్తమ నటి క్యాటగిరి లో నేషనల్ అవార్డు ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ముంతాజ్ సర్కార్ విషయానికి వస్తే, ఆమె సుప్రసిద్ధ మాంత్రికులు పి . సి. సర్కార్ కుమార్తె. 

 

గురు చిత్రం ఆడియో ను మర్చి మొదటి వరం లో విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్ గతం లో "కబాలి", "భైరవా" వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Allu Arjun: పేరెంట్స్ చనిపోవడంతో హోటల్‌లో క్లాస్‌మేట్‌.. అల్లు అర్జున్‌ లైఫ్‌ని మార్చిన అమ్మ నిర్ణయం
120 కోట్ల ఒప్పందం రద్దు, దళపతి విజయ్ కి షాక్.. జన నాయగన్ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఎందుకలా చేసింది?